గవర్నర్ తో భేటీ కానున్న ఆర్టీసీ కార్మికులు

RTC workers  meet with the governor

తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె 35వ రోజు కొనసాగుతుంది. ఆందోళనలతో రాష్ట్రం హోరెత్తిపోతుంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణా గవర్నర్ తమిళిసైని సైతం కలిసి వినతిపత్రం అందించారు.రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పనితీరును నిరసిస్తూ గాంధీభవన్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్ వద్దే వారిని వెలుపలికి రాకుండా నియంత్రించడంతో తోపులాట చోటుచేసుకుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండటంతో పోలీసులు కొంతమంది నేతలను అదుపులోకి తీసుకున్నారు.ఈ నేపథ్యంలో పార్టీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో పార్టీ నేతలు రాజ్ భవన్ చేరుకుని  గవర్నర్ తమిళిసైను కలిశారు. ఆర్టీసీ సమ్మె, ఇతర అంశాలను ఆమెకు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. కాగా, కాంగ్రెస్ ఇచ్చిన కలెక్టరేట్ల ముట్టడి పిలుపు మేరకు పలు జిల్లాల్లో పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. హన్మకొండలో పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ, శాసన సభ్యుడు వీరయ్య ధర్నా చేశారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించడంతో వీరిని పోలీసులు అరెస్టు చేశారు.
tags: telangana, ts rtc strike, rtc strike, rtc workers, governor tamilisai soundara rajan, congress leaders, gandhi bhavan, raj bhavan

ఆర్టీసీ సంస్థకు షాక్ ఇచ్చిన పీఎఫ్ ఆఫీస్ 

 అవినీతి కూపంగా రెవెన్యూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *