సకల జనుల సమ్మె రికార్డును బ్రేక్ చేసిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

RTC workers strike reached 43rd day

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరింది. విలీనం డిమాండ్ ను పక్కన పెట్టి మిగతా డిమాండ్లను పరిశీలించాలని, చర్చలకు ఆహ్వానించాలని ఆర్టీసీ కార్మిక జెఎసి ఒక అడుగు వెనక్కి వేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తిని పట్టించుకోలేదు. అంతేకాకుండా ప్రైవేటీకరణకు చకచకా పావులు కదుపుతోంది. దీంతోపాటు ఆర్టీసీ కార్మికులకు వి ఆర్ ఎస్ ఇచ్చి ఇంటికి పంపాలన్న నిర్ణయం పైన కూడా కసరత్తు చేస్తుంది. ఇక దీంతో విలీన అంశంపై వెనక్కి తగ్గేది లేదంటూ ఆర్టీసీ జేఏసీ మరోమారు స్పష్టం చేసింది. 26 డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ భీష్మించుకొని కూర్చొంది. ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం ససేమిరా అనడంతో సమ్మె కొనసాగుతూ వస్తోంది. శనివారంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరింది. సకల జనుల సమ్మె సమయంలో కార్మికులు 42 రోజులు సమ్మె చేయగా.. ఆ రికార్డును ఆర్టీసీ సమ్మె బ్రేక్ చేసింది. ఇక నేడు సమ్మెలో భాగంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తన ఇంటిలో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఆర్టీసి విలీనం పై వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. 26 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ పైన రాజీ పడేది లేదని పేర్కొన్నారు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావడం కోసం రైల్ రోకోలు, సడక్ బంద్ లు చేస్తామని ప్రకటించారు.

tags : tsrtc strike, rtc strike, telangana government, rtc workers JAC, ashwatthama reddy, hunger strike, sadak bandh, rail roko, telangana movement

67 రోజుల తర్వాత జైలు నుండి బెయిల్ పై విడుదలైన చింతమనేని ప్రభాకర్

అయ్యప్పను దర్శించుకోవడానికి వెళ్తానంటున్న తృప్తి దేశాయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *