సాహో రెండు వారాలు వాయిదా?

Spread the love
SAAHO DELAYED ANOTHER TWO WEEKS
బాహుబ‌లి భారీ హిట్ త‌రువాత ప్ర‌భాస్ న‌టించిన సాహో చిత్రం విడుద‌ల తేదీ ఎట్ట‌కేల‌కు ఖ‌రారు అయింది. కానీ, అది కూడా ఇప్పుడు వాయిదా ప‌డిందే..! బాహుబ‌లి వ‌చ్చి రెండేళ్ల‌యింది. మ‌రో హీరో అయితే దానికి కొచ్చిన ఊపుతో.. ఈపాటికి ఓ రెండు సినిమాలు లాగేసేవాడు. కానీ, ప్ర‌భాస్ మాత్రం స్లో అండ్ స్ట‌డీ అంటూ సాహో మీద మాత్ర‌మే ఉన్నాడు. ఈ ఏడాది స‌మ్మ‌ర్లోనే సాహో వ‌చ్చెయ్యాలి. కానీ, భారీ ప్రొడక్ష‌న్ క‌దా… విజువ‌ల్ ఎఫెక్ట్స్ పూర్తి కాలేదు, యాక్ష‌న్ స‌న్నివేశాలు షూటింగు పెరిగిపోయింది… ఇలా చాలా కార‌ణాలు చెబుతూ ఆగ‌స్టు 15కి విడుద‌ల తేదీని నెట్టేశారు. ఇప్పుడు ఆ తేదీ కూడా మారిపోయి.. ఏకంగా మ‌రో రెండు వారాలు ఆల‌స్యంగా సాహో విడుద‌ల అవుతోంది.
దాదాపు రూ. 300 కోట్ల భారీ బ‌డ్జెట్ సినిమా కాబ‌ట్టి, విడుద‌ల ఆల‌స్య‌మైనా ఫ‌ర్వాలేదు. కానీ, ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల తేదీలు మార్చుతూ వెళ్తుంటే… ఇంత‌కీ ఆ టీమ్ కి ప‌ని మీద స‌రైన అంచ‌నా ఉందా లేదా, భారీ ప్రాజెక్టుని స‌రిగా హేండిల్ చేస్తున్నారా లేదా అనే అనుమానాలు ఎవ‌రికైనా స‌హ‌జంగా క‌లుగుతాయి. భారీ బ‌డ్జెట్ సినిమా అనుకున్న‌ప్పుడు దానికి టైం ప‌ట్టొచ్చు. కానీ, దాన్ని ప‌క్కాగా అంచ‌నా వేసుకోవాలి. ఒక‌సారి విడుద‌ల తేదీ అంటూ ప్ర‌క‌టించాక‌… వెన‌క్కి త‌గ్గ‌కూడ‌దు, దాన్ని మార్చ‌కూడ‌దు. మారిస్తే… సినిమాకి వ‌చ్చిన క్రేజంతా పోయి, తెర వెన‌క ఏం జ‌రుగుతోందో అనే ఆస‌క్తి మీద‌కి ప్రేక్ష‌కుల ఫోక‌స్ డైవ‌ర్ట్ అవుతుంది. ఇప్పుడు సాహో విష‌యంలో అదే జ‌రిగింది. టీజ‌ర్ కి మాంచి క్రేజ్ వ‌చ్చింది. ఆ త‌రువాత‌, ఓ పాట టీజ‌ర్ వ‌దిల్తే… ఇది తెలుగు సినిమానేనా అనే డౌట్ చాలామందికి వ‌చ్చింది. ఇప్పుడేమో విడుద‌ల తేదీ మార్చేశారు. ఇక‌, ముందుంది సాహో ట్రైల‌ర్ క‌ట్ మాత్ర‌మే. అది ఓ ఊపు ఊపేస్తే త‌ప్ప‌… ఇప్పుడు మొద‌లైన ఈ త‌ర‌హా ప్ర‌చారానికి బ్రేక్ ప‌డ‌దు. ఏదేమైనా, విడుద‌ల తేదీ మార్పుతో కొత్త చ‌ర్చ‌ను సాహో టీమ్ కొని తెచ్చుకున్న‌ట్టుగానే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *