కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి సబితమ్మ కారెక్కేది అందుకే .?

Spread the love

Sabitha Shock to Congress and jumpt to Congress

మాజీ మంత్రి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మొదట టిఆర్ఎస్ పార్టీలో చేరాలనుకున్న సబితా ఇంద్రారెడ్డిని రాహుల్ గాంధీ స్వయంగా బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆమెను ఢిల్లీకి రావాలని కోరారు. దీంతో వెనక్కు తగ్గిన సబిత రేవంత్ రెడ్డి తో కలిసి రాహుల్ గాంధీతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. అయితే అనూహ్యంగా మరోమారు రంగంలోకి దిగిన అసద్ సబితా ఇంద్రారెడ్డిని టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఒప్పించారు. అసలు అసద్ సబితా కు ఏం చెప్పి టీఆర్ ఎస్ లో చేరేందుకు ఒప్పించారు అన్నది తెలంగాణా రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

సబితా ఇంద్రారెడ్డిని ఎలాగైనా టిఆర్ఎస్ పార్టీలో చేర్పించాలని కంకణం కట్టుకున్న గులాబీ బాస్ మజ్లీస్ అధినేత అసద్ ను మరోమారు రంగంలోకి దింపారు. సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవితోపాటు, ఆమె కుమారుడికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సబితమ్మ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి టీఆర్ఎస్ లో చేరడానికి రెడీ అయిపోయారు. ఇదే విషయం పై అసద్ ఆమెతో చర్చించారు. సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి, ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డికి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తారని భావించి సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారు. అయితే సబితా ఇంద్రారెడ్డి కుమారుడికి ఎంపీ గా అవకాశం ఇవ్వడానికి కెసిఆర్ అంగీకరించలేదు. అదే సమయంలో సబితా ఇంద్రారెడ్డి చిన్న పుచ్చుకోకుండా కెసిఆర్ ఆమెకు మరో ఆఫర్ ఇచ్చినట్లు గా తెలుస్తుంది. కార్తీక్ రెడ్డి కి ఎంపీ టికెట్ కు నో చెప్పిన కేసీఆర్, ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడానికి స్పష్టమైన హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో ఆమె రాహుల్ గాంధీకి ఝలక్ ఇచ్చి , కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చి కార్ ఎక్కేందుకు ఫైనల్ గా డిసైడ్ అయ్యారని సమాచారం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *