సఫాయి కర్మచారికి ఛైర్ పర్సన్ పదవి

safai karmachari is chair person in telangana

పరకాలలో దళిత సామాజిక వర్గంలోని సఫాయి కర్మచారికి ఛైర్ పర్సన్ పదవి దక్కింది, ఎస్సీ లోని నేతకాని, బుడగజంగాలకు పదవులు దక్కాయి అనీ మంత్రి కెటిఆర్ కు వివరించారు. బీ సీ, ఎం బీ సీ లకు ఆత్మగౌరవ భవనాలకు సుమారు 3 నుండి 4 వేల కోట్ల విలువైన ఉప్పల్ భగాయత్ మరియు కోకాపేట లాంటి విలువైన ప్రాంతాలలో 80 ఏకరాల భూమి మరియు భవనాల నిర్మాణానికి 80 కోట్ల రూపాయలను కేటాయించి బీ సీ ల ఆత్మగౌరవాన్ని పెంచారని బీ సీ సంఘాల నాయకులు మంత్రి కెటిఆర్ కు వివరించారు.

గత 70 ఏళ్ళలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు బి సి కులాలకు కనీసం వార్డు మెంబర్ గా అవకాశం లేని దశ నుండి అణగారిన కులాలకు, ఇన్నాళ్లు అధికారానికి దూరంగా ఉన్న అట్టడుగు కులాలైన బీ సీ,  ఎం బీ సీ లకు ఈసారి పదవులు కల్పించనందుకు బీ సీ సంఘాల నాయకులు మంత్రి శ్రీ కె టి ఆర్ ను కలసి ఆభినందనలు తెలిపారు. మన ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల్లో మేయర్లు , డిప్యూటి మేయర్లు , ఛైర్ పర్సన్లు, వైస్ పర్సన్లు లో టీ ఆర్ ఎస్ పార్టీ సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని బి సి సంఘాలు వెల్లడించాయి. గతంలో ఏన్నడూ, ఏ పార్టీ ఇవ్వని విధంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేసింది. బడుగు, బలహీనవర్గాలకు పదవులతో పట్టాభిషేకం చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్జతలు తెలిపారు. రాజకీయంగా బీ సీ, ఎస్సీ, ఎస్టీ లతో పాటు ఎంబీసీ లకు అత్యున్నత స్థానం కల్పిస్తామని సి యం కెసియార్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని వివరించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఓ సఫాయి కర్మచారి, ఓ దళితుడు జనరల్ స్ఖానాల్లో ఛైర్ పర్సన్ లుగా ఏనాడు ఎన్నికవలేదని మంత్రి కెటిఆర్ కు వివరించారు. బీసీ, ఎం బీ సీ లకు 58 మేయర్,  ఛైర్ పర్సన్ పదవులు, 45 వైస్ చైర్ పర్సన్ పదవులలో అవకాశం కల్పించినందుకు బీ సీ సంఘాల నాయకులు మంత్రి కె టి ఆర్ కు అభినందనలు తెలిపారు. బీ సీ లలో గౌడ్ లకు 17, ముదిరాజ్ లకు 13, మున్నురు కాపు లకు 21, పద్మశాలీలకు 13, యాదవ 18, లింగాయత్ లకు 6, కురుమలకు 4, ఆర్యక్షత్రియలకు 3 పదవులు దక్కాయి. వీటి తో పాటు ఇన్నాల్లు అధికారానికి దూరంగా వున్న ఎంబీసీ కులాలు పరకాల లో సఫాయి కర్మచారీ,నేతకానీ, బుడగ జంగాలకు 1, కుమ్మరి పట్కరి, పెరిక, వడ్ల, పద్మశాలి, ఎల్లాపు, రెడ్డిక, అవుసాలి వారికి వొక్కొక్కటి చైర్మన్ పదవులు దక్కినయన్నారు.  కోర్టు నిర్ధేశించిన రిజర్వేషన్ల కంటే అధికంగా అనగా సుమారు 45 శాతం పదవులు లభించాయిని వివరించారు.

TELANGANA UPDATES 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *