రూ.400 కోట్లు దాటిన సాహో వసూళ్లు

SAHOO IN 400 CRORES CLUB

ప్రభాస్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా వసూళ్లు రూ.400 కోట్ల మార్కు దాటింది. సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా గ్రాస్ పరంగా వసూళ్లు బాగానే ఉంటాయని ట్రేడ్ పండితులు ముందుగానే అంచనా వేశారు. అందుకు తగినట్టుగానే వసూళ్లలో బాగానే ముందుకెళ్తోంది. ఇప్పటికి రూ.400 కోట్ల గ్రాస్ సాధించింది. అయినప్పటికీ నష్టాలు తప్పవనే అభిప్రాయం వినిపిస్తోంది. 20 శాతం నుంచి 30 శాతం వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తొలి రోజే డిజాస్టర్‌ టాక్‌ రావడం, ఆ తర్వాత సినిమా పబ్లిసిటీని దాదాపుగా అటకెక్కించేయడంతో ‘సాహో’ పూర్తిగా పడకేసేసింది. ఓవర్సీస్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ మూడు మిలియన్ మార్క్ దాటడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. దీంతో అక్కడ కూడా నష్టాలు తప్పవని అంటున్నారు. రెండో వారం కూడా పూర్తికావడంతో ఇక వసూళ్లు పెద్దగా ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. తెలుగు వెర్షన్ ఒక్కటే చూసినా షేర్ పరంగా రూ.100 కోట్లకు రావడం కష్టమేనని చెబుతన్నారు. తెలుగుతో పోల్చితే, హిందీలోనే మంచి ఫలితాలు రావడం గమనార్హం.

TELUGU CINEMA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *