సాహో మూవీ డివైడ్ టాక్?

SAHOO MOVIE DIVIDE TALK?

దేశవ్యాప్తంగా పదివేల సినిమా థియేటర్లలో విడుదలైన సాహో గురించి ఓవర్సీస్ ప్రేక్షకులు పెదవి విరిస్తున్నారని సమాచారం. అప్పుడే డివైడ్ టాక్ మొదలైంది. ఎంతో క్యూరియాసిటీని జెనరేట్ చేసిన ఈ చిత్రం స్క్రీన్ ప్లే చాలా వీక్ అని, పెద్దగా స్టఫ్ లేదని, ఒక్క ఫోటోగ్రఫీ తప్ప ఈ సినిమా గురించి చెప్పుకోదగ్గ విషయాలేం లేవని అంటున్నారు. ఇలా, నెగటివ్ ప్రచారం ఆరంభమైంది. ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ మూవీ చాలా బోరింగ్ గా ఉందని వెంటనే నిద్ర వచ్చేస్తుందన్నారు. అయితే, ఈ సినిమా ప్రభాస్ యాక్టింగ్ అదుర్స్ అని అభిమానులు అంటున్నారు. ప్రతి యాక్షన్ సీన్, ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్ అని చెబుతున్నారు. ప్రభాస్ నటన సూపర్ అంటూ ఈ మూవీకి జీవం పోసింది ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ సూపర్ అంటూ సుజిత్ ను ప్రశంసిస్తున్నారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ ల లవ్ కెమిస్ట్రీ అదిరిందని ఓవర్సీస్ అభిమానులు అంటున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో ప్రబాస్ ఇరగదీశాడని చెబుతున్నారు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ జీవం పోసిందని సుజిత్ ను ప్రశంసల వర్షం కురుస్తున్నది. కొందరు మాత్రం ఈ సినిమాకు 2 రేటింగును ఇస్తున్నారు. ఇది కాస్త ఇబ్బంది కలిగించే విషయమని చెప్పొచ్చు. సినిమా ప్రథమార్థం ఇంట్రడొక్షన్లతోనే వేస్ట్ అయ్యిందని వ్యాఖ్యానించేవారున్నారు.

#SahooLatestUpdates

#SahooMovieNews

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *