సాహో…సజ్జనార్‌

Sahoo VC Sajjanar
దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌- శుక్రవారం ఈ వార్తే అందరి గుడ్‌ మార్నింగ్ మేసెజ్‌. ఒక్కొక్కరిలో మాములు ఆనందం కాదు. వాట్సాప్‌ గ్రూప్‌, సోషల్‌ మీడియా ​అకౌంట్స్‌లో ఎన్‌కౌంటర్‌ న్యూస్‌ సూపర్‌ ఫాస్ట్‌గా స్ప్రెడ్‌ అయిపోయింది. సామాన్యులు- సెలబ్రిటీలు అందరిలో సేమ్‌ ఎమోషన్‌- ఫైనల్‌గా న్యాయం జరిగింది. దిశ ఆత్మకు ​కొంతైన శాంతి లభిస్తోంది. హీరో- హీరోయిన్స్‌, డైరెక్టర్స్‌ ఇలా టాలీవుడ్‌ మొత్తం ట్విట్టర్‌లో తమ ఆనందాన్ని పంచుకొంది. దిశ ఎన్‌కౌంటర్‌ న్యూస్‌ చాటింపు వేయండి ​అంటూ రిక్వెస్ట్‌ చేసింది. ​
ఇక సోషల్‌ మీడియా అయితే సజ్జనార్‌ను ఆకాశానికెత్తేసింది. ఏమని పొగడాలి… ఎంతని చెప్పాలి నీ గురించి అంటూ సజ్జనార్‌ను పొగడటానికి పదాలు వెదుక్కుంటున్నారు. ​తెలిసిన కోట్స్‌, యాప్ట్‌ సినిమా డైలాగ్స్‌ అన్ని గుర్తు తెచ్చుకొని మరీ సజ్జనార్‌ సాబ్‌ను తమకు తోచినట్టు ప్రశంసిస్తున్నారు. మేసెజ్‌ల వరద పారుతుండటంతో సోషల్‌ ​మీడియాలో అన్ని ప్లాట్‌ఫామ్స్ మీద తెలంగాణా పోలీస్‌, సజ్జనార్‌ హ్యాష్‌ట్యాగ్‌లతో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్నారు. అమాయకురాలని అన్యాయంగా బలి చేసిన ​దుర్మార్గులకు తగిన శిక్ష విధించిన తెలంగాణ పోలీస్‌ ఈ మాత్రం పొగడ్తలకు ఆ మాత్రం అర్హులే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *