చిరుకు సిస్టర్ గా సాయి పల్లవి?

3
Sai pallavi Act As a Chiru sister?
Sai pallavi Act As a Chiru sister?

Sai pallavi Act As a Chiru sister?

సాయి పల్లవి అంటేనే సింబాలిక్ పాత్రలకు పేరు. అందుకే ఆమె కోసం డైరెక్టర్లు ప్రత్యేకమైన పాత్రలు రెడీ చేస్తుంటారు. ప్రేమమ్, ఫిదా, విరాటపర్వం అలాంటి చిత్రాలే మరి. హీరోయిన్ గా ఫుల్ స్వింగ్ లో సాయి పల్లవి సహాయక ప్రాతలకు ఒప్పుకుంటుందా అంటే… అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.

సాయి పల్లవి చెల్లెలు పాత్ర అంగీకరిస్తారా? ఆ పాత్ర చుట్టూ కథ తిరిగితే అప్పుడు ఒప్పుకునే అవకాశం ఉంది. తమిళ చిత్రం ‘వేదాళం’లో ఉన్న చెల్లెలు పాత్ర అలాంటిదే. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో చిరంజీవి హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో చెల్లెలి పాత్రను లక్ష్మీ మీనన్‌ చేశారు. తెలుగులో ఆ పాత్రకు సాయి పల్లవిని అనుకుంటున్నారని సమాచారం. చిరంజీవి హీరోగా రూపొందనున్న సినిమా, పైగా పాత్ర కూడా గొప్పగానే ఉంటుంది. అందుకే సాయి పల్లవి ఈ సినిమాకు ఓకే చెప్పవచ్చేమో..