సాయి రెడ్డి వర్సెస్ బుద్దా .. మధ్యలో లోకేష్ 

Sai Reddy vs Budda

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నారా లోకేష్‌పై మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ‘మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడు. మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి పోతే ఎలా? అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

గతకొన్నిరోజులుగా మాజీ మంత్రి నారా లోకేష్ వైసీపీపై విమర్శల దాడి చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితోపాటు, మంత్రులు, ప్రభుతంపై ఆరోపణలు చేస్టు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. వైసీపీ సర్కార్‌కు సంబంధించిన ప్రతీ అంశంపై ఆయన తనదైనశైలిలో ట్వీట్లు చేస్తున్నారు. వాలంటీర్ల నియామకంలో కులం, మతం చూడలేదు వైకాపా కార్యకర్తా? కాదా? అని మాత్రమే చూసాం అని స్వయంగా ప్రకటిస్తున్నారు అంటూ పోస్టులు పెట్టారు లోకేష్. అంతేకాదు… జగన్ పై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఏది ఏమైనా జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇదే ఎమ్మెల్యే, చంద్రబాబుగారిని అసెంబ్లీలో ‘ఖబడ్దార్’ అని అన్నప్పుడు ముసిముసి నవ్వులు నవ్విన జగన్ గారు ఇప్పుడా నవ్వు ముఖాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలీక అవస్థలు పడుతుంటే మాకూ బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం… వైసీపీ సంస్కృతి అలాంటిది అంటే నారా లోకేష్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. దీంతో ఎలా అయిన ట్విట్టర్‌లో నారా లోకేష్‌‌ దూకుడుకు కళ్లెం వేయాలంటూ.. విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

టీడీపీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ధ్వజమెత్తారు. “సెల్ఫ్ గోల్ విజయసాయిరెడ్డిగారూ, లోకేశ్ గారు ఎన్నికల్లో రూ.150 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపిస్తున్నారు, మీరేమైనా ఆ డబ్బును లెక్కబెట్టి ఇచ్చారా? మీలాగా అవినీతి శతకాలు వల్లెవేయలేదు కాబట్టే లోకేశ్ గారు ఓడిపోయి ఉండొచ్చేమో కానీ, మీలా ప్రతి నియోజకవర్గంలో రూ.18 కోట్లు మాత్రం కుమ్మరించలేదు, అందుకు మీ ఉండి రాజుగారే సాక్షి” అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి నరసింహరాజు ఓ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. పార్టీ నుంచి ప్రతి అభ్యర్థికి రూ.10 కోట్ల నుంచి రూ.18 కోట్లు అందాయన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *