వైసీపీదే విజయం అని చంద్రబాబుకు తెలుసన్న సజ్జల

Sajala Commented Chandrababu knows Jagan will won

ఏపీలో నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎన్నికలు పూర్తయినా ఇంకా ఫలితాలకు సమయం ఉన్న నేపధ్యంలో విజయావకాశాలపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ విజయం సాధించబోతోందని చంద్రబాబుకు తెలుసని, అందుకే, ఈవీఎంలు సరిగా లేవంటూ కారణాలు సిద్ధం చేసుకుంటున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని, ఈవీఎంలలో పొరపాట్లు లేకుండా ఉండేందుకే ఈసీ వీవీ ప్యాట్లు తీసుకొచ్చిందని అన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత చంద్రబాబు తీరు దారుణమని, ఈసీని తప్పుబట్టడం సరికాదని, ఈసీపై నెపం వేసేందుకు బాబు యత్నిస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *