సమంత గేమ్ ఓవర్ అవుతుందా..?

samantha career

సమంత.. సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా రాణించింది. పెళ్లి తర్వాత వైవిధ్యమైన పాత్రలకే నా ఓటు అంటూ దూసుకుపోతోంది. అలాగే పాత్ర డిమాండ్ చేస్తే ఇప్పటికీ ఎక్స్ పోజింగ్ విషయంలో ఏ ఇబ్బందీ లేదంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పెళ్లి తర్వాతే కెరీర్ బెస్ట్ అనదగ్గ రామలక్ష్మి పాత్రతో రంగస్థలంలో మెప్పించింది. అలాగే హీరోయిన్ ఓరియంటెడ్ లాంటి ‘ఓ బేబీ’తో తన నటనతో ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ అడుగపెట్టింది. సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మేన్’ సీక్వెల్ లో ఓ కీలక పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఇదే టైమ్ లో మరో బాలీవుడ్ సినిమాకూ సైన్ చేసింది. సోనీ పిక్చర్స్ ససంస్థ నిర్మించబోతోన్న ఈ చిత్రం ఓ లేడీ ఓరియంటెడ్ కథ అని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇక సమంత బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది అనేది నిజమే. ఇది పూర్తిగా తను ఇప్పటి వరకూ చేయని కథ అంటున్నారు. పైగా ప్యాన్ ఇండియన్ సబ్జెక్ట్ అట. అందుకే సినిమాను కూడా అదే స్థాయిలో నిర్మించబోతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కు ఎక్కువ స్కోప్ ఉన్న ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్ లోనే టాకీ పార్ట్ పూర్తి చేసేలా ప్రణాళికలు వేసుకున్నారు.

ఇక ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు అనే విషయంలో రకరకాల పేర్లు వినిపించినా.. ఫైనల్ గా ఓ తమిళ దర్శకుడు పేరు ఫైనల్ అయింది. గతంలో తాప్సీ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’అనే థ్రిల్లర్ సినిమాను రూపొందించిన అశ్విన్ శరవణన్ ఈ సారి ప్యాన్ ఇండియన్ లెవెల్లో సమంత గేమ్ ఛేంజ్ చేయడానికి ఓకే చెప్పాడు. అఫ్ కోర్స్ ఈ కథ కూడా అతనిదే. అయితే సోనీ పిక్చర్స్ వంటి నిర్మాణ సంస్థ ముందుకు రావడం అశ్విన్ ప్రతిభకు తార్కాణం. ఈ యేడాది చివరి వరకూ సినిమాను పూర్తి చేసి వచ్చే యేడాది సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారట. ఇక ఇప్పుడు సమంత తమిళ్ లోఓ సినిమాలో నటిస్తోంది. విజయ్ సేతుపతి సరసన విఘ్నేశ్ శివన్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా ఇది. అన్నట్టు విఘ్నేశ్ లవర్ నయనతార కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఏ భామకు ఎక్కువ స్కోప్ ఇస్తాడనే ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. మొత్తంగా అశ్విన్ శరవణన్ డైరెక్షన్ లో సమంత బాలీవుడ్ తో పాటు ప్యాన్ ఇండియన్ లెవెల్లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోందన్నమాట.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *