ఆ విలన్ కూ బ్రేక్ ఇచ్చినట్టేనా..?

sampath raj comeback with nitin bheeshma

టాలెంట్ కు లక్ కూడా ఉంటేనే ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతారు. మొదటిది ఉన్నా రెండోదాని వల్ల ఒకప్పుడు అన్ని సినిమాల్లో కనిపించిన నటుడు సంపత్ కొన్నాళ్లుగా తెలుగులో సడెన్ గా మాయం అయ్యాడు. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. అతని హైట్ కు ఏ హీరోకైనా విలన్ గా, లేదా సాఫ్ట్ క్యారెక్టర్స్ లోనూ సూట్ అవుతాడు. అందుకే కొన్నాళ్లు తెలుగులో బాగా హల్చల్ చేశాడు. మరి ఏమైందో కానీ సడెన్ గా డల్ అయిన అతని మార్కెట్ ను మళ్లీ పెంచేలా లేటెస్ట్ గా వచ్చిన భీష్మ చిత్రం కనిపిస్తోంది.
భీష్మ లో ఏసిపిగా అతని పాత్ర,నటనా రెండూ ఆకట్టుకున్నాయి. అందుకే నితిన్ కూడా తనకు రష్మికతో కంటే సంపత్ తోనే మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయిందని చెప్పాడు. నిజానికి ఇలాంటి పాత్రల్లో సంపత్ నిజాయితీగా కనిపిస్తాడు.

మొత్తంగా సంపత్ ను అంతా మర్చిపోయిన  టైమ్ లో వెదికి మరీ తెచ్చిన దర్శకుడు వెంకీ కుడుములకు అతను రుణపడి ఉన్నాడనేచెప్పాలి. లేదంటే రోజుకో కొత్త నటుడు వస్తోన్న వేళ సంపత్ ను గుర్తుంచుకుని అతనికి మరో మెమరబుల్ రోల్ చేయడం అంటే చిన్న విషయం కాదు కదా.. సో.. వెంకీ ఈ మూవీతో నితిన్ కే కాదు సంతప్ కు మళ్లీ బ్రేక్ ఇచ్చాడని చెప్పాలి.

sampath raj comeback with nitin bheeshma,#nitinbheeshma,#sampathraj,venky kudumula breaks to sampath raj,bheeshma movie cast and crew,tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *