5న శాంసంగ్ 5జీ ఫోన్

Spread the love

SAMSUNG 5G PHONE

  • దక్షిణ కొరియాలో లాంచ్ చేయనున్న కంపెనీ

5వ తరం ఫోన్ తీసుకొచ్చే విషయంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ దూకుడు కనబరుస్తోంది. తొలి 5జీ ఫోన్ తానే తీసుకురావాలనే సంకల్పంతో దూసుకెళుతోంది. ప్రపంచంలోనే తొలి 5జీ ఫోన్ ను వచ్చేనెలలోనే లాంచ్ చేయాలని యోచిస్తోంది. తద్వారా యాపిల్ సంస్థపై పై చేయి సాధించాలని భావిస్తోంది. శాంసంగ్‌ ‘గెలాక్సీ ఎస్‌ 10’ 5జీ స్మార్ట్ ఫోన్ ను దక్షిణ కొరియాలో ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఏప్రిల్‌ 5న ఈ ఫోన్ ఆవిష్కరించనుంది.  ఇందుకు సంబంధించి సిగ్నల్‌ వెరిఫికేషన్‌ పరీక్ష కూడా పూర్తిచేసుకుంది. విడుదల చేసిన రోజు నుంచే అమ్మకాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో అధికారిక సమాచారం ఏమీ లేనప్పటికీ, ఏప్రిల్ 5వ తేదీన 5జీ ఫోన్ విడుదల ఖాయమనే కథనాలు వస్తున్నాయి. ధర సుమారుగా రూ.లక్ష లోపు ఉండే అవకాశం ఉంది.

శాంసంగ్‌ ఎస్‌10 5జీ ఫోన్ ఫీచర్లివే…
6.70 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 9.0
12+12+16+0.038 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
100.038 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌
4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

MOBILE MARKET

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *