శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫోన్

SAMSUNG NEW PHONE

చైనా మొబైల్ దిగ్గజం షావోమీ రంగప్రవేశంతో మార్కెట్ లో ప్రాభవం కోల్పోయిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్ మరో కొత్త ఫోన్ తో దూసుకొస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌లో భాగంగా శాసంగ్‌ గెలాక్సీ ఎస్‌10 లైట్‌ పేరుతో కొత్త వేరియంట్‌ను తీసుకొస్తోంది. గెలాక్సీ ఎస్ 10 లైట్ మొబైల్‌లో గెలాక్సీ ఎ 91 మాదిరిగానే 45వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌, ట్రిపుల్‌ రియర్‌ కెమెరాను అమర్చినట్టు తెలుస్తోంది. ఈ ఫోన్ గురించి కంపెనీ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వనప్పటికీ, ఇందులోని ఫీచర్లు అదిరిపోయేలా ఉన్నాంటూ నెట్ లో లీకులు వస్తున్నాయి. వాటి ప్రకారం ఈ ఫోన్ లో 6.7 అంగుళాల  ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతోపాటు 855 స్నాప్‌డ్రాగన్ చిప్ సెట్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్ తోపాటు 48 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన రియర్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా పొందుపరిచనట్టు సమాచారం. ఇక చార్జింగ్ ఎక్కువ సేపు ఉండేందుకు 4500 ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫోన్ కి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రానుంది.

MOBILE NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *