శాంసంగ్ నుంచి ఖరీదైన స్మార్ట్ ఫోన్లు

Spread the love

SAMSUNG SMART PHONES

  • నాలుగు మోడళ్లు విడుదల చేసిన కంపెనీ

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ నుంచి ఖరీదైన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో గెలాక్సీ ఎస్‌ 10, ఎస్‌ 10ఈ, ఎస్‌ 10 ప్లస్‌, ఎస్‌ 10 5జీ మోడళ్లను విడుదల చేసింది. వీటిలో ఎస్‌10 5జీ మినహా మిగతా మూడు మోడళ్లు మార్చి 8 నుంచి భారత మార్కెట్లో లభ్యం కానున్నాయి. వీటిలో ఎస్10 ప్లస్‌ ధర రూ. లక్ష పైనే ఉంది. గెలాక్సీ ఎస్‌ 10 ప్లస్‌లో మొత్తం మూడు వేరియంట్లను భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 73,900, 512 జీబీ వేరియంట్‌ ధర రూ. 91,900, 1 టెరాబైట్‌ వేరియంట్‌ ఎస్‌ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 1,17,900గా ఉన్నట్లు శామ్‌సంగ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక గెలాక్సీ ఎస్‌ 10 ఫోన్‌ రెండు వేరియంట్లలో లభించనుంది. 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 66,900, 512 జీబీ వేరియంట్ ధర రూ. 84,900గా నిర్ణయించింది. గెలాక్సీ ఎస్‌ 10ఈ ఫోన్‌ ధర రూ. 55,900గా ఉండనుంది. (ఈ ఫోన్ ధర రూ.1.40 లక్షలు)

MOBILE MARKET

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *