వైసీపీలోనూ ఇసుకాసురులు

Spread the love

SAND RIFT IN YCP

  • ఎంపీ నందిగంపై ఎమ్మెల్యే శ్రీదేవి ఫైర్
  • సీఎం జగన్ వద్దకు చేరిన పంచాయతీ

ఇసుక మాఫియా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంత నష్టం చేసిందో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే తెలుస్తుంది. జన్మభూమి కమిటీల ఆగడాలు, ఇసుక మాఫియా అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వచ్చిన జగన్ ను అక్కున చేర్చుకున్నారు. ఆయనకు అఖండ మెజార్టీ కట్టబెట్టారు. అయితే, ఈ ఇసుక మాఫియా జగన్ కూ ఇబ్బందులు తెచ్చింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఎంపీ నందిగం సురేష్‌ ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారనీ, అడ్డగోలుగా ఇసుక కుంభకోణాలు చేస్తున్నారనీ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యవహారంపై ఇరువురు నేతల అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. ఈ వ్యవహారం సీఎం జగన్ కు చేరడంతో ఆయన అలెర్ట్ అయ్యారు. పార్టీ ముఖ్య నేతల్ని అప్రమత్తం చేసి, వారి పంచాయతీ తీర్చడానికి సమాయత్తమయ్యారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *