అదిరిపోయే సినిమానా?

Spread the love
SANDEEP KISHAN LATEST MOVIE
సందీప్ కిష‌న్‌.. చాలారోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాలైతే అడ‌పాద‌డ‌పా వ‌స్తున్నాయిగానీ, ఆశించిన స్థాయిలో విజ‌యాలు సాధించ‌డం లేదు. తెలుగుతో పాటు త‌మిళంలో కూడా నగ‌రం, మాయ‌వాన్ లాంటి సినిమాల‌తో కొంత గుర్తింపు తెచ్చుకున్నా… దాన్ని కొన‌సాగించ‌లేక స‌త‌మ‌త‌మౌతున్నాడు. ఆ మ‌ధ్య‌, ఓ నిర్మాత సందీప్ మీద మాట‌ల దాడి చేస్తూ… ఓ కుక్క‌ను పెట్టుకుని సినిమా తీయ‌డం ఈజీ అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో, సందీప్ తో సినిమా చేయ‌డమంటే అంత తలనొప్పి వ్య‌వ‌హారమా అనే చ‌ర్చ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో కొన్నాళ్లు న‌డించింది! ఓర‌కంగా ఆ ఎపిసోడ్ సందీప్ కి కొంత ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితే తీసుకొచ్చింది.
స‌రే, ఎట్ట‌కేల‌కు ఇప్పుడు… నిను వీడ‌ని నీడ‌ను నేనే అంటూ కొత్త సినిమాతో వ‌స్తున్నాడు. ఈ వార‌మే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో సందీప్ మాట్లాడుతూ… ఇది క‌చ్చితంగా అదిరిపోతుంద‌నీ, అంత క‌ష్ట‌ప‌డి తీశామ‌నీ, సినిమా యూనిట్లో ఏ ఒక్క‌రినీ మోసం చెయ్య‌లేద‌నీ, అంద‌రికీ డ‌బ్బులు ప‌క్కాగా ఇచ్చామ‌నీ, ప్ర‌తీరోజూ సెట్ లో దాదాపు 150 మందికి మూడు పూట‌లా భోజ‌నం పెట్టామ‌నీ… ఇలా కాదంటూనే ఎమోష‌నల్ స్పీచ్ ఇచ్చేశాడు. ఒక‌టైతే వాస్త‌వం… కంటెంట్ బాగుంటే, దానికి ప్ర‌త్యేకంగా ప‌బ్లిసిటీ స్టంట్ అవ‌స‌ర్లేదు! ఆడియెన్స్ మౌత్ టాక్ చాలు. గ‌త వారం విడుద‌లైన ఏజెంట్ ఆత్రేయ‌, బ్రోచేవారెవ‌రురా సినిమాల‌కి అదే క‌దా ప్ల‌స్ అయింది.  మ‌రి, సందీప్ ఇప్పుడైనా హిట్ కొడితే… త‌న‌పై ఉన్న విమ‌ర్శ‌లూ పోతాయి, మ‌ళ్లీ గాడిలోకి వ‌చ్చేస్తాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *