సోదరుడు సన్యాసి పాత్రుడు టీడీపీకి గుడ్ బై

Sanayasi Pathrudu Good Bye to TDP

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తమ్ముడైన చింతకాయల సన్యాసి పాత్రుడు టిడిపికి గుడ్ బై చెప్పారు. ఆయన త్వరలో వైసిపి తీర్థం పుచ్చుకో బోతున్నారు అని వార్తలు జోరందుకున్నాయి. వైజాగ్ ప్రాంతాల్లోని టీడీపీకి చెందిన ముఖ్య నాయకులలో అయ్యన్నపాత్రుడు ఒకరు. అయ్యన్నపాత్రుడు సోదరుడు చింతకాయల సన్యాసి పాత్రుడు కూడా తెలుగుదేశం పార్టీ కోసం విశేషంగా కృషి చేశారు. 2014 ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికల్లోనూ సన్యాసి పాత్రుడు పార్టీ విజయం కోసం కీలకమైన పాత్రను పోషించారు.
అయితే తాజాగా చింతకాయల సన్యాసి పాత్రుడు టీడీపీకి గుడ్ బై చెప్పడం వెనుక అయ్యన్నపాత్రుడికి , సోదరుడు సన్యాసి పాత్రుడు కి మధ్య అంతర్గత ఘర్షణలు కారణమని చెబుతున్నారు. వీరి మధ్య అంతర్గత విభేదాల కారణంగానే సన్యాసి పాత్రుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గా తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని టిడిపి హైకమాండ్ కూడా తెలియజేసినట్లు గా సమాచారం. దీంతో ఈ రోజు ఉదయం సన్యాసి పాత్రుడు, కొంతమంది కౌన్సిలర్ల తో కలిసి తెలుగుదేశం పార్టీలో పదవులకు రాజీనామా చేశారు. ఇక త్వరలో తాము తీసుకునే నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలియజేశారు. అయితే సన్యాసి పాత్రుడు వైయస్సార్సీపి లో చేరే అవకాశముందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ఆయన వైసీపీలో చేరుతారా, లేదా బీజేపీలో చేరతారా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఏదేమైనప్పటికీ అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసి పాత్రుడు రాజీనామా చేయడం టిడిపి కి పెద్ద దెబ్బ అని చెప్పాలి.

India Series Against Windies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *