సుశాంత్ తో డేటింగ్ చేశా..

4
Sara Ali khan date with Sushanth
Sara Ali khan date with Sushanth

Sara Ali khan date with Sushanth

డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లలో సారాతో పాటు దీపిక పదుకొణే, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ సిమోనీ ఖంబట్టా, దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌ ఉన్నారు. వాళ్లంతా అయితే నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ముందుకు రావడంతో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నటి సారా అలీ ఖాన్‌ విచారణకు హాజరయ్యారు.

‘సుశాంత్‌తో కొంతకాలం ప్రేమలో ఉన్న మాట వాస్తవం, థాయ్‌లాండ్‌కు పర్యటనలో ఆయనతో కలిసి వెళ్లా’నని సారా చెప్తోంది. తాను సిగరెట్స్‌ తాగేదాన్ని, తప్పితే డ్రగ్స్‌ ఎప్పుడూ తీసుకోలేదని ఆమె తెలిపారని ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి. సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడని సారా చెప్పడం గమనార్హం. మరోవైపు.. కరణ్‌ జోహార్‌ సంస్థ ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పని చేసిన క్షితిజ్‌ రవి ప్రసాద్‌కు ముంబై కోర్టు వచ్చే నెల 3 వరకూ రిమాండ్‌ విధించింది.