Sara Tendulkar share birthday pic
సచిన్ టెండూల్కర్ ఎంత ఫేమస్సో, తన ముద్దుల కూతురు సారా టెండూల్కర్ కూడా అంతే ఫేమస్ అవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సారాకు రోజురోజుకూ అభిమానులు పెరిగిపోతున్నారు. సారా కూడా ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ఆకట్టుకుంటుంది. గతంలో కూడా సారా ప్రేమలోపడిందని వార్తలు బాగా వినవచ్చాయి. అయితే సోషల్ మీడియాలో తనకంటూ క్రేజ్ సంపాదించుకుంటోంది సారా.
23 ఏళ్ల సారాకు ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 10 లక్షలమంది ఫాలోయర్లు ఉన్నారు. తన 23వ బర్త్ డేకు దిగిన ఫొటోను సారా షేర్ చేసింది. ఆమెకు మంచి ఫ్యాషన్ సెన్స్ ఉందని, సారా అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.