సరిలేరు నీకెవ్వరు టీజర్

Sarileru Neekevvaru teaser

ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ ని అద్భుతంగ కట్ చేసి విడుదల చేసింది. మరి ఆ వివరాలేంటో చూద్దాం…

మహర్షి లాంటి హిట్ తర్వాత మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు సిద్దమౌతున్నాడు. మహేశ్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్, F2 లాంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో తనకంటూ సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నఈ దర్శకుడు ఇప్పుడు మహేష్ తో జతకట్టడంతో అంచనాలు ఒక్కసారిగా డబుల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేసి మరింత హైప్ పెంచేశారు. ముఖ్యంగా సినిమాలోని ప్రతి డైలాగ్ అభిమానులల్ని విజిల్స్ వేపించేస్తుంది. మిలటరీలో పనిచేసే అజయ్ గా మహేష్ ని చూపిస్తూ టిజర్ మొదలవుతుంది. అంతలోనే కర్నూల్ లో సన్నివేశాలు చూపిస్తూ క్యూరియాసిటీ పెంచేశాడు దర్శకుడు. ఇక విజయశాంతి ఎంట్రీ అదుర్స్ అనిపించింది. ఆమె చెప్పే డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అయితే టీజర్ లో కొత్తదనం లేనప్పటికీ సినిమా హిట్ అన్న సంకేతాలు మాత్రం వచ్చాయి టీజర్ చూస్తున్నంతసేపు. మరి ఈ సినిమాలోని డైలాగ్స్ చూస్తే…

ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతి మొగుడు వచ్చాడు అంటూ ప్రకాష్ రాజ్ పలికే డైలాగ్ కి ఫాన్స్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇక టీజర్ మొదట్లో మీరు ఎవరో మాకు తెలియదు.. మీకు మాకు ఏ రక్త సంబంధం లేదు.. కాని మీ కోసం మీ పిల్లల కోసం ఎండ వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం ఎందుకంటే మీరు మా బాధ్యత అంటూ మొదలవుతుంది ఈ టీజర్. అదేవిదంగా మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలురా.. మిమ్మల్ని ఎలా చంపుకుంటానురా.. మీ కోసం ప్రాణాలను ఇస్తున్నాం రా అక్కడ. మీరేమో కత్తులు గొడ్డలు వేసుకుని ఆడాళ్ల మీద. బాధ్యత ఉండక్కర్లా అంటూ మహేష్ పలికే ఈ డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక భయ పడే వాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాల్లేవమ్మా అనే పవర్ ఫుల్ డైలాగ్‌ బాగుంది. ఇక ఈ సినిమాలో రాములమ్మ డైలాగ్స్ బాగున్నాయి. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్ అంటూ విజయశాంతి అదరగొట్టేసింది.

మొత్తానికి టీజర్ సినిమాపై అంచనాల్ని మరింత పెంచేశాయి. దిల్‌రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం 2020 జనవరి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది.

Sarileru Neekevvaru teaser

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *