అమెరికాలో కలెక్షన్ల సునామి

Sarileru Neekevvaru vs Ala Vaikunta Puram lo Collections

ఈ సంక్రాంతి పండుగకు విడుదలైన సినిమాలు దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో. విడుదలైన మూడు సినిమాలు భారీ విజయాల్నే అందుకున్నాయి. మురుగదాస్ దర్శకత్వంలో రజినీ నటించిన దర్బార్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. ఇక ఈ మూడు సినిమాలు ఇండియాలోనే కాదు ఓవర్సేస్ లోను సత్తా చాటుతున్నాయి. ఈ మూడు సినిమాలు కలిసి ఇప్పటికే 31 కోట్ల రూపాయలు వసూలు చేసి సత్తా చాటాయి. దర్బార్‌ ఐదో రోజుల్లో రూ.10.11 కోట్లు సాధించగా, ‘సరిలేరు నీకెవ్వరు’ మూడు రోజుల్లోనే రూ.11.51 కోట్లు రాబట్టింది. ‘అల.. వైకుంఠపురంలో’ రెండు రోజుల్లేనే రూ.9.92 కోట్లు సాధించి దూసుకెళుతోంది. ఇకపోతే అల్లు అర్జున్ అల.. వైకుంఠపురంలో’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించగా… మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తొలిరోజు .46.77 కోట్ల షేర్‌ రాబట్టింది. ఏదిఏమైనా 2020 సంక్రాంతి పండుగకు సినిమా పరిశ్రమ లాభాలబాట పట్టింది.

Sarileru Neekevvaru vs Ala Vaikunta Puram lo Collections,Box Office Overseas,Rajinikanth,Mahesh Babu,Allu Arjun,Darbar Collections

Related posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *