సర్వదర్శనం టోకెన్ల నిలిపివేత

36
Sarvadarshanam Tokens Stopped
Sarvadarshanam Tokens Stopped

SARVADARSHANAM TOKENS STOPPED

దేశంలో కోవిడ్ -19 వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టైంస్లాట్ (ఎస్ఎస్‌డి) టోకెన్ల జారీని వచ్చే సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు టిటిడి తెలిపింది. అనగా ఆదివారం (11.4.2021) సాయంత్రం వరకు మాత్రమే టోకెన్లు జారీ చేస్తారు. కరోనా కేసులు ఉదృతమవుతున్న క్రమంలో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విష‌యం విదిత‌మే. తిరుపతి నగరంలో కూడా కరోనా కేసులు క్ర‌మేణా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసంలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్య‌లో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఈ పరిస్థితుల్లో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులు గమనించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. తదుపరి టోకెన్లు ఎప్పుడు జారీ చేసేది ముందుగా తెలియజేయడం జరుగుతుంది.

Tirumala Latest News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here