శేష్ దే అవలేదు.. శర్వానందా మహేష్?

sarwanand in major?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. తను చేసిన సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే పక్కా బిజినెస్ మేన్. సినిమాల్లోనే కాక సినిమాతోనూ వ్యాపారం చేస్తూ నాలుగు చేతులా(మిగతా రెండు నమ్రతవి) సంపాదిస్తున్నాడు. ఒక్కో సినిమాకు తెలుగులో హయ్యొస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగానూ నిలుస్తున్నాడు మహేష్ బాబు. కొంత కాలంగా కాన్ స్టంట్స్ హిట్స్ తో దూసుకుపోతోన్న ఈ సూపర్ స్టార్.. కొన్నాళ్ల క్రితం సొంతంగా నిర్మాణ సంస్థను కూడా స్థాపించాడు. ‘జిఎమ్.బి’పేరుతో మొదలైన ఈ ప్రొడక్షన్ హౌస్ అటు ఎగ్జిబిషన్ రంగంలోనూ ఏసియన్ గ్రూప్స్ తో కలిసి మల్టీప్లెక్స్ వ్యాపారంలో ఉంది. ఇక ఈ నిర్మాణ సంస్థ నుంచి తొలిసారిగా బయటి హీరో అడవి శేష్ తో సినిమా మొదలుపెట్టారు. ఆర్మీ మేజర్ కథతో ‘మేజర్’అనే టైటిల్ తో మొదలైన ఈ సినిమా నిజంగా షూటింగ్ చేసి ఉంటే లాక్ డౌన్ కు ముందే విడుదలై ఉండేది. కానీ ఇప్పటి వరకూ చిన్న టీజర్ కు కూడా సీన్ లేదు. మరి ఆ సినిమా షూటింగ్ జరుగిందా.. ఇంకా ఎంత వర్క్ ఉంది అనేది పక్కన బెడితే.. ప్రస్తుతం ఈ బ్యానర్ లో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు అంటూ ఓ కొత్త వార్త వినిపిస్తోంది.

ప్రస్తుతం వరుస ఫ్లాపులతో చాలా వెనకబడిపోయాడు శర్వానంద్. అయినా చేతిలో మూణ్నాలుగు ప్రాజెక్టులున్నాయి. వీటిలో శ్రీకారం సినిమా థియేటర్స్ ఓపెన్ కాగానే విడదలవుతుంది. మరోవైపు తెలుగు, తమిళ్ లో ఓ ద్విభాషా చిత్రం కూడా చేస్తున్నాడు. ఈ టైమ్ లో అతనికి మహేష్ బాబు ప్రొడక్షన్ నుంచి ఆఫర్ అంటే పెద్ద విషయంగానే చెప్పాలి. మామూలుగా మహేష్ కథల కోసమే ఓ టీమ్ ఏర్పాటు చేసుకున్నాడట. ఆ టీమ్ ఇప్పటికే శర్వాకు స్టోరీ చెప్పిందని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి.  శర్వానంద్ మరోవైపు అజయ్ భూపతి డైరెక్షన్ లో మహా సముద్రం కూడా చేయాల్సి ఉంది. ఒకవేళ మహేష్ బాబు ప్రాజెక్ట్ నిజమే అయితే మాత్రం అజయ్ కి మరోసారి ఇబ్బంది తప్పదు. ఎందుకంటే జిఎమ్.బి ప్రొడక్షన్ ను కాదని మహా సముద్రంకు ప్రాధాన్యత ఇస్తాడు అనుకోలేం. ఏదేమైనా ఇప్పటి వరకూ ‘మేజర్’ సినిమాకు సంబంధించే ఏ మేజర్ వార్తా లేదు. అలాంటిది ఇప్పుడు మరో హీరోతో సినిమా అనేదే  నమ్మదగిన వార్తలా కనిపించడం లేదు.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *