ఆడవాళ్లూ మీకు జోహార్లు అంటోన్నశర్వానంద్

3
sarwanand new movie
sarwanand new movie

sarwanand movie

టాలీవుడ్ లోని టాలెంటెడ్ యంగ్ స్టర్స్ లో శర్వానంద్ ఒకడు. వైవిద్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు శర్వానంద్. మధ్యలో కమర్సియల్ సినిమాలవైపూ వచ్చాడు. కొన్ని హిట్స్ అందుకున్నాడు. కానీ కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. రాధ, పడి పడిలేచె మనసె, రణరంగం, జాను అంటూ వరుసగా ఫ్లాపులే వస్తున్నాయి. ప్రస్తుతం అతను నటించిన శ్రీకారం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రైతుల సమస్యలకు సంబంధించిన కథ ఇది. గ్యాంగ్ లీడర్ ఫేమ్  ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. దీని తర్వాత ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతితో మహా సముద్రం సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయింది. ఇందులోనే ప్రియాంకనే హీరోయిన్. సిద్ధార్థ్ మరో హీరోగా నటిస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా శర్వానంద్ ఓ క్రేజ్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. తెలుగులో ఆ తరంలో ఫ్యామిలీ ఆడియన్స్ లో నేటికీ తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో వెంకటేష్. అతన్ని ఉద్దేశించుకుని రాసుకున్న ఓ కథ శర్వా చెంతకు వచ్చింది. ఆ దర్శకుడు కూడా ప్రామిసింగ్ అనే పేరు తెచ్చుకున్నాడు.

ఇంతకు ముందు రామ్, కీర్తి సురేష్ జంటగా నేను శైలజ మూవీతో సూపర్ హిట్ అందుకున్న కిశోర్ తిరుమల. యస్.. గతంలో కిశోర్ తిరుమల – వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా డిస్కషన్ లోకి వచ్చింది. త్వరలోనే ప్రారంభం అనుకున్న ఈ సినిమా ఎందుకో ఆగిపోయింది. అదే కథలో కొన్ని మార్పులు చేసి శర్వానంద్ కు చెప్పాడట కిశోర్. శర్వాకు నచ్చడంతో మాగ్జిమం ఓకే అయింది అంటున్నారు. ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’అనే టైటిల్ కూడా ఫిక్స్ అయిన ఈ మూవీని చెరుకూరి సుధాకర్ నిర్మించబోతున్నాడు. టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని గట్టిగా అనుకుంటున్నారట. ఆల్రెడీ సాయి పల్లవి, శర్వానంద్ కలిసి పడిపడిలేచె మనసెలో నటించారు. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా పండిందీ సినిమాలో. వచ్చే యేడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందట. మొత్తంగా శర్వానంద్ సైలెంట్ గా దూకుడు పెంచుతున్నాడు.

tollywood news