సేవ్ నల్లమల అంటూ దొంగ నాటకాలు వద్దు

SAVE NALLAMALA IS A CHEAP TRICKS

ఈమధ్య కొందరు సినీ ప్రముఖులకు సేవ్ నల్లమల అంటూ దొంగ నాటకాలు ప్రారంభించారు. అసలు యురేనియం సర్వేకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఒకవైపు చెబుతున్నప్పటికీ కొందరు నటీనటులు సేవ్ నల్లమల అంటూ దొంగ నాటకాలు షురూ చేశారు. అయితే, ఇక్కడ ప్రతిఒక్కరూ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. హైదరాబాద్ కేంద్రంగా అర్థ శతాబ్దం నుంచీ ఎన్ఎఫ్సీ యురేనియం తయారీ చేస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున అప్పట్లో ఏఎస్ రావు గారి లాంటి వాళ్ళ పుణ్యమా అని ఏర్పాటైన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ) లో ఎప్పటి నుంచో యురేనియం ఉత్పత్తి జరుగుతోంది. ఝూర్ఖండ్ గనుల నుంచి వచ్చిన ఖనిజాలతో ఎన్ఎఫ్సీ ఏటా 250 టన్నుల యురేనియంను ఉత్పత్తి చేస్తోంది. వందలాది మందికి ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తోంది. దేశానికి, తెలంగాణ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తోంది. ఇన్ని దశాబ్దాలుగా ఏ ఒక్కరూ రేడియేషన్ ప్రభావానికి గురైన సందర్భం ఒక్కటి కూడా లేదు. అందుకే సేవ్ నల్లమల ఆందోళన అర్ధం లేనిదని చెప్పొచ్చు. బహుశా సేవ్ నల్లమల బాచ్ కు ఎన్ఎఫ్సీ హైదరాబాద్ గురించి తెలియదేమో. నల్లమల సంరక్షణ అంటూ గగ్గోలు పెడుతున్న వాళ్ళకు 1971 లోనే హైదరాబాద్ లో ఏర్పాటైన ఎన్ఎఫ్సీని ఒక చక్కటి ఉదాహరణగా చూపవచ్చు. కాబట్టి, సినీ ప్రముఖులు ఏదో ప్రచారం కోసం పాకులాడకుండా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకూడదు. వాస్తవాలను అర్థం చేసుకుని ప్రవర్తిస్తే ఉత్తమం అని నెటిజన్లు అంటున్నారు.

NALLAMALA LATEST NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *