నన్నపునేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

Spread the love

SC, SC ATROCITY CASE ON NANNAPANENI

చలో ఆత్మకూరు’ ను అడ్డుకునే క్రమంలో భాగంగా టీడీపీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులపై చాలా దురుసుగా ప్రవర్తించారు టీడీపీ నాయకులు .పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడిన టిడిపి నేతలు పోలీసులపై విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. ఇక సాటి మహిళ అని కూడా చూడకుండా టీడీపీ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఓ మహిళా ఎస్సై మనస్థాపం చెందేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆమె విధుల నుంచి వెళ్ళిపోయిందని తెలుస్తుంది .ఇక ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హోం మంత్రి సుచరిత పేర్కొన్నారు. ఇక నన్నపునేని అనుచిత వ్యాఖ్యలపై మహిళా ఎస్సై చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు .

చంద్రబాబు నివాసం వద్ద టిడిపి నేతలు పోలీసుల తీరుపై వాగ్వాదానికి దిగిన సందర్భంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులతో వాగ్వాదానికి దిగిన రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నన్నపనేని రాజకుమారి ‘దళితుల వల్లనే దరిద్రం’ అంటూ అక్కడే విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్‌ఐ అనురాధపై నోరు జారి మాట్లాడారని సమాచారం . నన్నపనేని వ్యాఖ్యలతో మనస్థాపానికి గురైన మహిళా ఎస్సై అనురాధ విధుల నుండి వెళ్లిపోయారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాళ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా ఆమెపై కేసు నమోదు చేశారు

అయితే తాను ఎలాంటి కించపరిచే వ్యాఖ్యలు చెయ్యలేదని ,ఆ ఆరోపణలు కరెక్టు కాదని స్పష్టం చేశారు నన్నపునేని రాజకుమారి . మహిళా ఎస్సైని అవమానకరంగా మాట్లాడినట్టు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకునేందుకు తాను సిద్ధమని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం తనను కావాలని వేధిస్తుందని ఆమె పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు.వైసీపీ సర్కార్ తనను మానసిక వేధింపులకు గురి చేసి మహిళా కమిషన్ చైర్మన్ పదవికి బలవంతంగా రాజీనామా చేయించిందని ఆరోపించారు. రాజీనామా చేసినా ప్రభుత్వం తనను వదలడం లేదని నన్నపునేని రాజకుమారి విమర్శలు గుప్పించారు.

BJP లో చేరుతున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్

ఏపీలో త్వరలో మళ్ళీ ఎన్నికల జాతర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *