కూల్చకుండా కొవిడ్ కేంద్రమైతే?

6
Secreteriat Covid Centre
Secreteriat Covid Centre

SECRETARIAT COVID CENTRE?

కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నది. కరోనా వచ్చిన కొత్తలో ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపడంలో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆతర్వాత పత్తా లేకుండా పోయారు. ప్రస్తుతం ప్రగతి భవనలో ఉన్నారో లేక ఫామ్ హౌజ్లో ఉన్నారో తెలియదు. అయినప్పటికీ, ఆయన సచివాలయం కూల్చివేతకు ముహుూర్తం ఖరారు చేయడం.. అర్థరాత్రి కూల్చివేయడం వెనువెంటనే జరిగిపోయింది. అర్థరాత్రి కూల్చివేతలు జరిపిన తర్వాత.. అంటే, మరుసటి రోజు ఉదయం అందరికీ తెలిసింది. ఈ విషయం బయటికి పొక్కడంతో ప్రజలంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇంత తుగ్లక్ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

కొవిడ్ నేపథ్యంలో కేసులు పెరుగుతున్నాయి. బయట ఎక్కడా బెడ్లు దొరకడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల దండుకుంటున్నారు. ఈ తరుణంలో, ఇదే సచివాలయాన్ని క్వారంటైన్ సెంటర్ గా పెడితే ప్రజలకు ఒక భరోసా కలిగేది. బ్లాకులన్నీ వేర్వేరుగా ఉండటంతో సచివాలయం ప్రజలకెంతో ఉపయోగకరంగా ఉండేది. సచివాలయాన్ని కొవిడ్ సెంటర్ గా మార్చకుండా.. రాత్రికి రాత్రే కూల్చివేతలు జరిపి.. హడావిడిగా కొత్త సచివాలయం కట్టడమెందుకు అని ప్రజలు నిలదీస్తున్నారు. నిన్నటివరకూ కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడనివారు సైతం ఇది తప్పుడు నిర్ణయమని అంటున్నారు. మరి, కేసీఆర్ బయటికొచ్చి ఈ నిర్ణయంపై ఎలాంటి వివరణ ఇస్తారో..

SECRETARIAT DEMOLITION NOT RIGHT