ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇద్దరికీ భద్రత పెంపు

Spread the love

Security Increased For MLA’S

తెలంగాణలో ఇద్దరు శాసనసభ్యులకు ప్రభుత్వం భద్రతను పెంచింది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టీఆర్ ఎస్ లో చేరి పార్టీ ఫిరాయించిన ఇద్దరికీ భద్రత పెంచింది .కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిలు వారి నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రజల ఆగ్రహాన్ని చవి చూస్తున్నారు. ప్రజాభీష్టం మేరకే పార్టీ మారుతున్నామని చెప్పే నేతలు కేవలం స్వప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్న నేపధ్యంలో ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు బాగా కోపంతో ఉన్నారు. ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంలో ఉన్న ఎమ్మెల్యేలు తమకు భద్రతను పెంచాల్సందిగా ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. వీరి విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకున్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఇద్దరికి 4+4 గన్‌మెన్‌లను కేటాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *