సెప్టెంబరు 8 నుంచి 14 వారఫలాలు

September Second Week Horoscope

మేషరాశి :ఈవారం చేయాలనుకున్న ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మీకు ఉపయోగపడుతుంది. సోదరుల నుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది, వారినుండి ప్రశంశలు పొందుటకు ఆస్కారం కలదు. రుణపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట సూచన. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. రుణపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. దైవపరమైన విషయాల్లో సమయం ఇవ్వడం మంచిది.

వృషభరాశి : ఈవారం దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. దూరప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో స్పష్టత కలిగి ఉండుట సూచన. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు. నూతన పరిచయాలకు అవకాశం కలదు . చిన్న చిన్న విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. విదేశీప్రయాణప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చర్చల్లో పాల్గొనే ఆస్కారం ఉంది.
మిథునరాశి: ఈవారం మీ మాటతీరు మూలన మీ ఆత్మీయులు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది, కాస్త చూసుకొని ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరంభంలో కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన.మానసికంగా దృడంగా ఉండుట సూచన.పెద్దలను ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వాహనాలను లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సాధ్యమైనంత మేర చర్చాపరమైన విషయాల్లో సమయం గడుపుతారు. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ వద్దు.
కర్కాటకరాశి: ఈవారం ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులలో మొదట్లో కొంత పనిఒత్తడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. విదేశాల్లో ఉన్నవారికి నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. పెద్దలనుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాలకే ఎదో తెలియని ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంది. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త నిదానంగా ఉండుట సూచన. బంధువులను కలుస్తారు.
సింహరాశి: ఈవారం తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం. ముందుగా చేపట్టిన పనులను పూర్తిచేయుట సూచన. పెద్దలతో మీ ఆలోచనలను తెలియజేసే ప్రయత్నం చేయుట మంచిది. స్వల్ప ఆరోగ్య సమస్యలు తప్పక పోవచ్చును. ఉద్యోగంలో కాస్త పనిఒత్తిడి పెరుగుతుంది, నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. వాహనాలను కొనుగోలు చేయుటకు ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. జీవితబాగాస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చర్చల్లో పాల్గొంటారు. స్త్రీ పరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు. వేచిచూసే ధోరణి మంచిది. 
కన్యారాశి: ఈవారం వ్యాపారపరమైన విషయాల్లో కాస్త ఓపికగా ఉండుట మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. తల్లితరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది, వారితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యక్రమాల గురుంచి చర్చలు చేయుటకు అవకాశం ఉంది, అలాగే ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. సర్దుబాటు విధానం మంచిది. మిత్రులనుండి కీలకమైన విషయాలు తెలుసుకుంటారు.
తులారాశి: ఈవారం పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. ముందుగా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుట సూచన. వ్యాపార పరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం.  స్వల్పఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీ మాటతీరు వలన నూతన వివాదాలకు అవకాశం ఉంది , కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. తండ్రి తరుపు బంధువుల నుండి వచ్చిన సూచనలు పెద్దగా మీకు నచ్చక పోవచ్చును. సోదరునితో మీ ఆలోచనలు పంచుకుంటారు, నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి.
వృశ్చికరాశిఈవారం కుటుంబంలో శుభకార్యక్రమాల గురుంచి చర్చలు చేయుటకు అవకాశం ఉంది. జీవితభాగస్వామి నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి, అలాగే ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. పెద్దలతో మీకున్న పరిచయాలు మీకు ఉపయోగపడుతాయి. చర్చల్లో మాత్రం నిదానంగా వ్యవహరించుట సూచన. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే ఆస్కారం కలదు. ఆత్మీయుల్లో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. చర్చాపరమైన విషయాల్లో మీ ఆలోచనలు స్పష్టగా తెలియజేసే ప్రయత్నం చేయుట ఉత్తమం. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. 
ధనస్సురాశి: ఈవారం ఆరంభంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. దైవపరమైన విషయాల్లో సమయాన్ని గడుపుతారు. గతంలో మధ్యలో ఆపిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం కలదు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది, వాటిని తగ్గించుకొనే ప్రయత్నంలో విఫలం చెందుతారు. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. జీవితభాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వాహనాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.
మకరరాశి : ఈవారం చేపట్టిన పనుల వలన సమాజంలో మంచి పేరు లభిస్తుంది. విదేశీప్రయాణప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. తండ్రితరుపు బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. స్త్రీపరమైన విషయాల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. వాహనాలను కొనుగోలు చేయుటకు చేసే ప్రయత్నాలు ముందుకు సాగక పోవచ్చును. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన.
కుంభరాశి : ఈవారం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. పెద్దలతో విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. జీవితభాగస్వామితో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉండే అవకాశం ఉంది, అనుభవజ్ఞుల సూచనలతో ముందుకు వెళ్ళండి. సంతానం విషయంలో బాగా ఆలోచించి ముఖ్యమైన ఆలోచనలు చేయుట వలన మేలుజరుగుతుంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం కలదు.
మీనరాశి : ఈవారం ఉద్యోగంలో పెద్దలతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాలను సైతం పట్టించుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువుల కుటుంబంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.  మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారినుండి ఆశించిన మేర సహాయ, సహకారాలు పొందుటకు అవకాశం కలదు. వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో మీకున్న పరిచయాల వలన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. మిత్రులను కలుస్తారు.

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిషాలయం
బి.టెక్, ఎం.ఎ (జ్యోతిషం, వేదాంగజ్యోతిషం),
మాస్టర్స్ ఇన్ వాస్తు, పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,
సంఖ్యాశాస్త్రం. ఎమ్ఎస్సి (సైకాలజీ )
www.janmalagna.com
9989647466
8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *