ప్రభాస్ ఫస్ట్ లుక్ పై సెటైర్స్

3
setires on prabhas first look
setires on prabhas first look

setires on prabhas first look

డార్లింగ్ స్టార్ ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్నాళ్లుగానో ఎదురుచూశారు అభిమానులు. చివరికి వారి కోరిక తీరింది. చెప్పినట్టుగానే ఈ శుక్రవారం ఉదయం పది గంటలకు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. చాలామంది ఊహించినట్టుగానే టైటిల్ ‘రాధే శ్యామ్’అనే పెట్టారు. అంటే రాధాకృష్ణలు అన్నమాట. భాగవతంలో వీరి ప్రేమకథకు ఎంతోమంది అభిమానులున్నారు. అందుకే ఈ ప్రేమకథకు ఆ టైటిల్ పెట్టారు అనుకోవచ్చు. దీంతో పాటు ఇది కూడా ఓ మంచి ప్రేమకథా చిత్రంగానే వస్తుందన్న సంకేతమూ ఇచ్చాడు దర్శకుడు. అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఊహించినంత గొప్పగా లేదనేది వాస్తవం. ప్రభాస్ సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలుసు. కానీ వాటిని అందుకోవడంలో ఈ పోస్టర్ సక్సెస్ అయిందని ఖచ్చితంగా చెప్పలేం. పైగా ఈ మధ్య వచ్చి సినిమాల పోస్టర్ తో కంపేర్ చేస్తూ అప్పుడే కాపీ అంటూ కమెంట్స్ చేస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్ జంటగా నటించిన కంచె సినిమా పోస్టర్ అచ్చం రాధేశ్యామ్ లానే ఉంది.

అఫ్ కోర్స్ ఇదే ఆ పోస్టర్ లా ఉందని చెప్పాలి. దీంతో కలరింగ్ కానీ, పోస్టర్ డిజైనింగ్ కానీ మరీ ఆకట్టుకునేంత గొప్పగా లేవనే చెప్పాలి. దీనికి తోడు పొలిటీషియన్ నారా లోకేష్, బ్రాహ్మణిల ఫోటోను కూడా యాడ్ చేసి కాపీ పేస్ అంటూ కొందరు సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు. లోకేష్, బ్రాహ్మణిల మేటర్ అలా ఉంచితే రాధేశ్యామ్ మాత్రం కంచె చిత్రం పోస్టర్ తో పూర్తిగా దగ్గరగా ఉండటం మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా పెద్దగా నచ్చడం లేదు. ఇంత పెద్ద నిర్మాణ సంస్థ.. అంత పెద్ద హీరోతో సినిమా చేస్తున్నప్పుడు.. పైగా మూవీకి సంబంధించి ఫస్ట్ అప్డేట్ అయినప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఉంటారు అని ఎవరైనా ఊహిస్తారు. కానీ అలాంటి జాగ్రత్తలు పెద్దగా కనిపించడం లేదు. లేదంటే అభిమానుల ఒత్తిడి తట్టుకోలేకే ఇలా హడావిడీగా విడుదల చేశారా అనేది తెలియదు కానీ.. మొత్తంగా రాధేశ్యామ్.. టైటిల్ బావుంది. కానీ పోస్టర్ కాదు అనేది నిజం.

tollywood news