ప్రభుత్వ అధికారులపై చీటింగ్ కేసు పెట్టాలన్న షబ్బీర్ అలీ

Shabbir Ali to file a cheating case against government officials

తెలంగాణా సీఎం కేసీఆర్‌ పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైకోర్ట్  తప్పు దారి పట్టించే యత్నం చేసిన వారిపై చీటింగ్ కేసు పెట్టాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆర్టీసీపై కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని విమర్శించారు. ఆర్టీసీ సమస్యపై అబద్దాలు చెప్పిన సీఎం, అధికారులపై మోసం కేసు నమోదు చేయాలన్నారు. హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని సీనియర్ అధికారులను బలవంతం చేసింది సీఎం అని షబ్బీర్ అలీ విమర్శించారు.కేసీఆర్‌కు అబద్దాలు ఆడటం అలవాటు అని గుర్తుచేశారు. ఇప్పుడే కాదు బహిరంగ సమావేశాలు, అసెంబ్లీ, కౌన్సిల్, మీడియాముఖంగా కూడా అబద్దాలు చెప్పారని పేర్కొన్నారు. ఓ సీఎం తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని హైకోర్టు తిరస్కరించడం తొలిసారి అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. దేశ చరిత్రలో తొలిసారి సీనియర్ ఐఏఎస్ అధికారులు బృందం సమస్యపై తప్పుడు సమాచారం ఇచ్చారని.. అందుకు హైకోర్టు మందలించిందని గుర్తుచేశారు. హైకోర్టు వ్యాఖ్యలను కేసీఆర్ సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని సూచించారు.ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం, కార్మికులు ఏమీ కాదని.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. మానవతా దృష్టితో ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరింది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం తాను పట్టిన పట్టు వీడకుండా ఆర్టీసీ విషయంలో షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
tags : tsrtc strike, rtc workers, high court, cm kcr, government officials, cheating case, cngress leader, shabbir ali

 ఆర్టీసీ కార్మికులతో ఇప్పటికైనా చర్చలు జరపండి

603 క్వింటాళ్ల ఉల్లిపాయలను  సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *