‘షాడో’.. ఇక కనిపిస్తాడు

shadow movie

షాడో.. ఈ పేరు చెబితే ఎయిటీస్, నైన్టీస్ వారికి ఓ రేంజ్ లో గగుర్పాటు కలుగుతుంది. మధుబాబు సృష్టించిన ఈ సూపర్ హీరో చేయని సాహసం లేదు. ఇంకా చెబితే హాలీవుడ్ కు జేమ్స్ బాండ్ ఎలాగో తెలుగు సాహిత్యానికి షాడో అలాగ. అలాగే ఓ క్యారెక్టర్ తో అనేక నవలలు ఫ్రాంఛైజీగా రావడం కూడా మధుబాబు మాత్రమే చేసిన సాహసం. ఆయన రచనల కోసం ఆ రోజుల్లో కళ్ల కాయలు కాచేలా ఎదురుచూసేవారు యాక్షన్ నవలల అభిమానులు. యాక్షన్ అభిమానులు అనే కాదు.. ఏ మాత్రం బిగి సడలని మధుబాబు రచనా చాతుర్యానికి ప్రతి ఒక్కరూ అడ్మైర్ అయిపోయారా రోజుల్లో. నవల చదువుతున్నంత సేపూ పాఠకుడు కూడా ఆ ప్రాంతంలోనే ఉండేవాడు. షాడోను చూస్తు ఉండేవాడు. అది మధుబాబు ప్రతిభ. అలాంటి షాడో ఇప్పుడు విజువల్ గా రాబోతున్నాడు. యస్.. షాడో కనిపించబోతున్నాడు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మధుబాబుతో కలిసి ఈ ఫ్రాంఛైజీని వెబ్ సిరీస్ గా చేయబోతోంది.

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ హీరోను ప్రేక్షకులకు చూపించేందుకు మధుబాబు కూడా ఒప్పుకున్నాడు. అనేక నవలలు వచ్చిన ఉన్న నేపథ్యంలో అన్నిటినీ కలిపి ఒకే సిరీస్ లో కాకపోయినా ప్రతి సీరీస్ లో ఒక్కో కథను కూడా చెప్పే వెసులుబాటు ఉన్న నవలలు అవి. అలాగని మొనాటనీ రాకుండా మధుబాబు వెబ్ సిరీస్ కు విజువలైజేషన్ కు అనుగుణంగా సరికొత్తగా మళ్లీ రాస్తున్నాడు. ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను ఎకే ఎంటర్టైన్మెంట్ సంస్థ త్వరలోనే చేయబోతోంది. మరోవైపు ఇంత సూపర్ స్టార్ గా ఎవరు నటిస్తారు. దర్శకుడు ఎవరు అనేది కూడా నిర్మాణ సంస్థకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఏదేమైనా ఏ కాలంలో చదివినా ఏక బిగిన చదివించే సత్తా ఉన్న నవలలు షాడో వి. మరి సిరీస్ గా ఎలా ఉంటాయో చూడాలి.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *