పార్టీ మారిన పనికి రాని నేత..

Shameless Jupudi Changed Party

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్తకంఠంతో అనుకుంటున్న మాట ఇది. ఎందుకో తెలుసా? 

జూపుడి ప్రభాకర్ రావు.. ఎస్సీ కులాన్ని అడ్డుపెట్టుకుని ఎదిగిన నేత. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగాడీ జూపుడి ప్రభాకర్ రావు. తనేదో గొప్ప మేధావి అనుకుంటాడని అతన్ని సమీపంగా చూసే వారు చెబుతుంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదవీలో ఉన్నంత కాలం వైఎస్ చెప్పులు నాకిన నేత జూపూడి, ఆ తర్వాత వైకాపా నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశాడు. వైకాపా నేతల వల్లే ఆ ఎన్నికల్లో ఓడిపోయానంటూ ఆరోపించి, తెగ ఫీలయ్యి.. అధికారంలోకి వచ్చిన తెదేపాలోకి జంప్ అయ్యాడు. ఎస్సీ కులం నుంచి ఎవరో ఒకరు ఉండాలనో.. మరే ఇతర కారణాలో తెలియదు కానీ, జూపుడిని చంద్రబాబు నాయుడు పార్టీలోకి చేర్చుకున్నాడు. అప్పటివరకూ వైఎస్సార్, జగన్ల గురించి గొప్పగా మాట్లాడిన నేత ఒక్కసారి పార్టీ మారగానే రివర్స్ గా మాట్లాడటం మొదలెట్టాడు. ఆయన చర్చలను విని, అతను మాట్లాడుతున్న మాటలను విని.. ప్రజలంతా షాక్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు, వైకాపా నేతలు ఒక్కసారిగా హతాశులయ్యారు. ఇతను ఇంత వెన్నెముక్క లేని నాయకుడేంటి అంటూ ముక్కున వేలేసుకున్నారు. జూపుడి నిజంగా ప్రజలకు, ఎస్సీ వర్గీయులకు న్యాయం చేయాలనుకుంటే, తమ వర్గానికి న్యాయం చేయాలని భావిస్తే.. తేదెపాలోనే ఉండి అధికార పార్టీ మీద పోరాటం చేయవచ్చు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఎస్సీ వర్గీయులకు వచ్చే నష్టమేం లేదు. ఈయన పార్టీ మారితేనే ఎస్సీలకు న్యాయం జరుగుతుందనేది కరెక్టు కాదు.

ప్రస్తుతం వైకాపా అధికారంలోకి వచ్చేసింది కాబట్టి, ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్లీ పార్టీలోకి అడుగుపెట్టేశాడు. మరి, తెదేపాలో ఉన్నప్పుడు జగన్ అండ్ కంపెనీని బండ బూతులు తిట్టిన జూపుడి.. తర్వాత చేయబోయే పని.. చంద్రబాబు నాయుడుని తిట్టడమే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. టీవీ చర్చల్లో వైకాపా నుంచి పాల్గొని ఇక నుంచి చంద్రబాబు నుంచి బండబూతులు తిట్టడం గ్యారెంటీ అని రాజకీయాలపై కాస్తో కూస్తో అవగాహన ఉన్న ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు వైకాపా అధికారంలో ఉంది కాబట్టి సరిపోయింది.. వచ్చే ఎన్నికల్లో పొరపాటున జనసేన లేదా కాంగ్రెస్, బీజేపీలు వంటి పార్టీల్లో ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తే.. సిగ్గులేకుండా ఆ పార్టీలోకి జంప్ చేస్తాడీ జంప్ జిలానీ. అయినా, వెన్నెముక్క ఇలాంటి వారిని పార్టీ అధినేతలు ఎలా ప్రోత్సహిస్తారని ప్రజలంతా విస్తుపోతున్నారు. ఇక, వచ్చే నాలుగేండ్లు జూపుడి సారు జగనన్న మీద ఈగ వాలకుండా టీవీ చర్చల్లో చూసుకుంటాడని ప్రజలంతా నవ్వుకుంటున్నారు. అయినా, ఇలాంటి పూటకూళ్ల నాయకులను ఎంకరేజ్ చేయకపోతేేనే మంచిదని సూచిస్తున్నారు.

REASONS FOR JUPUDI PARTY CHANGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *