ఫ్లాప్ షా.. మళ్లీ ఆ బ్యూటీయే అంటున్నాడా..?

1
sharukh with deepika
sharukh with deepika

sharukh with deepika

హిట్.. ఈ మాట వినకపోతే ఇండస్ట్రీకి నిద్రపట్టదు. ఆర్టిస్టులకు కెరీర్ ఉండదు. అందుకే ఎంత పెద్ద స్టార్ అయినా తన సినిమా విడుదల రోజున ఆ మాటనే వినాలని ఆతృతగా చూస్తాడు. కానీ కొన్నాళ్లు ఈ పదానికి దూరమై తెగ ఇదైపోతున్నాడు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్. ఒకప్పుడు బాక్సాఫీస్ బాద్ షా అనిపించుకున్నవాడు కాస్తా ఇప్పుడు బాక్సాఫీస్ ఫ్లాప్ షా అనిపించుకుంటున్నాడు. అందుకే తనకు ఫ్లాప్ లు వచ్చిన ప్రతిసారీ జట్టుకట్టిన ఓ హీరోయిన్ వల్ల హిట్ వచ్చింది. దీంతో ఈసారి కూడా ఆ భామనే రిపీట్ చేస్తున్నాడు. షారుఖ్ ఖాన్ కు కొన్నాళ్లుగా ఫ్లాపులు చుట్టుముట్టాయి. ఎన్ని ప్రయత్నాలు చేసిన హిట్ దొరకడం లేదు. మరోవైపు తన తరం స్టార్స్ అంతా ప్రయోగాలు చేస్తున్నారు. ఇతను మొదట్లో ప్రయోగాలకు దూరంగా వెళ్లినా రాయీస్ లాంటి సినిమాతో బయోపిక్ లాంటిది చేశాడు. బట్ నో యూజ్. తర్వాత వచ్చిన సినిమాలు దారుణంగా పోయాయి. దీంతో సార్ కు స్టార్డమ్ పోతున్న విషయం అర్థమైంది. అందుకే ఒకప్పుడు ఏ సౌత్ నైతే తను చిన్నచూపు చూశాడో ఇప్పుడు అదే సౌత్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. యస్.. మాస్ డైరెక్టర్ అట్లీతో షారుఖ్ ఇప్పుడు సంకీ అనే మూవీ చేస్తున్నాడు. అట్లీతో కొన్నాళ్ల క్రితమే కథ ఓకే అయింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ప్రారంభం కాకున్నా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో మొదలైంది.

అయితే ఎప్పట్లానే సీనియర్ హీరోలకు వచ్చే ప్రాబ్లమ్ షారుఖ్ కూ ఎదురైంది. హీరోయిన్ ఎవరు అనేదే ఆ ప్రాబ్లమ్. షారుఖ్ సరసన అంటే చాలామంది భామలున్నారు. కానీ ఎవరుంటే తనకు లక్ ఎక్కువగా చిక్కుతుందో అలాంటి బ్యూటీ కావాలనుకున్నాడు. అందుకే తనతో ఓమ్ శాంతి ఓమ్ సినిమాతో బాలీవుడ్ కు పరచయమైన దీపికా పదుకోణ్ నే కావాలంటున్నాడట. ఓమ్ శాంతి ఓమ్ తర్వాత దీపికతో షారుఖ్ చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాల్లో నటించాడు. ఈ రెండూ కమర్షియల్ గా మంచి విజయాలే సాధించాడు. దీంతో సెంటిమెంట్ కూడా వర్కవుట్ అవుతుందని షారుఖ్ ఈ సారి కూడా దీపికనే రిపీట్ చేయాలనుకుంటున్నాడట. కానీ అటు దీపిక కూడా ప్రస్తుతం ఏమంత బిజీగా లేదు. అందువల్ల ఈ క్రేజీ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా స్టార్ హీరోలు హిట్ వస్తే తమ క్రెడిట్ లో వేసుకుని, ఫ్లాపులు వస్తే సెంటిమెంట్స్ ను రిపీట్ చేయడంలో ఎక్స్ పర్ట్స్..

tollywood news