Shoba nayudu no more
కూచిపూడి అంటే శోభానాయుడు, శోభానాయుడు అంటే కూచిపుడి. అంతగా కూచిపూడికి ప్రాధాన్యం తీసుకొచ్చారు శోభానాయకుడు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె పొద్దుగాల తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ప్రముఖులు, సైలబ్రిటీలు, కూచిపూడి కళాకారులు సంతాపం తెలిపారు. శోభానాయుడి మరణం కూచిపూడి కళకు తీరని లోటు అన్నారు.
తన కూచిపూడితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. వెంపటి చిన సత్యం దగ్గర శిష్యరికం చేసిన ఆమె.. చిన్ననాటి నుంచే నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్లో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని స్థాపించి దాదాపు 40 ఏళ్ల పాటు వేల మందికి కూచిపూడిలో శిక్షణ ఇచ్చారు. శోభానాయుడికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె మరణంతో కూచిపూడి చిన్నబోయిందంటున్నారు అభిమానులు.