బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?

shock to pooja hegde

ఏ ఇండస్ట్రీలో అయినా స్టార్స్ మధ్య వార్ చూడ్డానికి అంత బావుండదు. అది అభిమానుల మధ్య గొడవలు తెస్తుంది. ఆఫర్స్ విషయంలో తేడాలు చూపుతుంది. అలాగే ఆయా స్టార్స్ కు ఉన్న ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లోనూ వేరియేషన్స్ తెస్తుంది. ఇవన్నీ తెలిసినా ఓ సీనియర్ తో మరో జూనియర్ స్టార్ లేటెస్ట్ గా ఓ చిన్న గొడవకు దిగింది. కాకపోతే ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు అని సదరు బుట్టబొమ్మ చెబుతోన్నా.. ఈ సీనియర్ బేబీ మాత్రం ససేమిరా అన్నట్టుగా కనిపిస్తోంది.  టాలీవుడ్ లో సీనియర్ భామల హవా తగ్గిన టైమ్ లో అనూహ్యంగా బికినీతో దూసుకువచ్చిన భామ పూజాహెగ్డే.. స్టార్ డైరెక్టర్స్ కు బెస్ట్ ఆప్షన్ గా మారడంతో ఆటోమేటిక్ గా అమ్మడు టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక రీసెంట్ గా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్న పూజా ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా ఆల్మోస్ట్ పూర్తయింది. అయితే ఈ బ్యాచులర్ వదిన సమంతతో అమ్మడు సున్నం పెట్టుకుందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. సమంత నటించిన మజిలీ సినిమా టివిలో టెలీకాస్ట్ అవుతుండగా ఓ ఫోటోను క్యాప్చర్ చేసి తను మంచి నటి కాదు అనే అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ పెట్టింది.

పూజాహెగ్డే పోస్ట్ చూసిన సమంత ఫ్యాన్స్ అంతా ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే తన ఇన్స్ స్టా హ్యాక్ అయిందని.. ఆ పోస్ట్ కు తనకూ ఎలాంటి సంబంధం లేదని పూజాహెగ్డే వివరణ ఇచ్చింది. కానీ అవేం పట్టించుకోకుండా సమంత ఫ్రెండ్స్ అయిన నందిని రెడ్డి, చిన్మయి శ్రీపాద వంటి వారంతా హ్యాకింగ్, ఇన్స్ స్టాలపై సెటైర్స్ వేస్తూ ఇన్ డైరెక్టుగా పూజాహెగ్డేను ట్రోల్ చేశారు.  వీరికి వంత పాడుతూ సమంత సైతం ఓ ట్వీటేసింది. మామూలుగా ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఇలాంటివి పర్సనల్ గా మాట్లాడుకుంటారు.కానీ పూజాహెగ్డే ఓపెన్ గా చెప్పింది అంటే తను మరీ కొత్త అమ్మాయి కాదు. పైగా ఏం మాట్లాడాలో తెలియకుండానే ఇంత స్టార్డమ్ వచ్చి ఉండదు. ఇక ఇటు సమంత గొప్ప నటే. ఇందులో ఎవరికీ డైట్స్ లేవు. కానీ చాలామంది సెలబ్రిటీస్ కు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్  హ్యాక్ అవడం కామన్ అన్న సంగతి తను పట్టించుకోకపోవడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. మొత్తంగా ఈ ముద్దుగుమ్మల మధ్య సోషల్ మీడియాలో ఓ వార్ నడుస్తోంది. పైగా ఇద్దరి ఫ్యాన్స్ అయితే ఇంక చెప్పలేం. మరి ఈ గొడవ ఎప్పుడు ఎలా ఎవరి ద్వారా సద్దుమణుగుతుందో చూడాలి.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *