వేతన జీవులకు షాకింగ్…

Shocking For salaried employees

మార్చి నెల వస్తుందంటే ఇంక్రిమెంట్ల కోసం వేతన జీవులు ఎదురు చూస్తుంటారు. అయితే  వేతన జీవులందరికి షాకింగ్ న్యూస్ . ఈ ఏడాది జీతాల పెంపు ఆశించినంత స్థాయిలో ఉండదని తేల్చి చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది . ఆర్థిక మందగమనం.. చైనా కరోనా వైరస్ ప్రభావం తో పాటు.. ఇతరత్రా కారణాలతో జీతాల పెంపు ఎక్కువగా ఉండదని.. గత ఏడాది డబుల్ డిజిట్ లో పెంపు ఉంటే ఈసారి సింగిల్ డిజిట్ కు పరిమితమవుతుందన్న మాట వినిపిస్తోంది.దీనికి తగ్గట్లే తాజాగా ప్రముఖ ప్రొఫెషనల్ సేవల సంస్థ ఏఒన్ పీఎల్ సీ వార్షిక వేతన పెంపు ఎంత ఉంటుందనే అంశంపై తాను చేపట్టిన సర్వేను వెల్లడించింది. దీని ప్రకారం 2018.. 2019లో కంపెనీలు 9.5.. 9.3 శాతం మేర వేతనాలు పెంచాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈసారి చాలా తక్కువగా జీతాల పెంపు ఉండనుందని పేర్కొంది.  తామీ మాటలు ఉత్తనే చెప్పటం లేదని.. 20రంగాలకు చెందిన వెయ్యి కంపెనీలను తమ సర్వేకు సంబంధించిన వివరాలు సేకరించి.. మదింపు చేసిన తర్వాతే ఈ చేదువార్త చెబుతున్నట్లుగా పేర్కొంది. ఈ తరహా సర్వేలను సాకుగా చూపించి జీతం పెంపులో కోత విధించినా ఆశ్చర్యం లేదేమో? మొత్తంగా 2020 వేతన జీవులకు నిరాశను మిగులుస్తుందనటంలో సందేహం లేదంటున్నారు. ఎంతో ఆశగా ఎదురు చూసే వేతన జీవులకు ఈ వార్త నిజంగా షాకింగ్ న్యూస్ .

salaried employees, increments , financial slow down effect , corona virus effect , salaries , professional companies , survey

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *