కొండాకు నాంపల్లి కోర్టులో చుక్కెదురు

shocking judgment for Konda From Nampally Court

కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది .ఎస్ఐ, కానిస్టేబుల్ ను నిర్బంధించిన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరరించింది. ఎస్ఐ, కానిస్టేబుల్ ను నిర్బంధించిన కేసులో కొండాపై కేసు నమోదైంది. అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. అయితే ఆయన కోసం వారం రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులకు దొరక్కుండా కొండా విశ్వేశ్వర్ రెడ్డి తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావడం లేదు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ రద్దు కావడంతో ఆయన పోలీసుల విచారణకు హాజరవుతారా లేక హైకోర్టుని ఆశ్రయిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఎన్నికల సమయంలో పోలీసుల తనిఖీల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంధువు కొండా సందీప్ రెడ్డి దగ్గర రూ.10లక్షలు దొరికాయి. దీనిపై వివరణ కోరేందుకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు తీసుకుని బంజారాహిల్స్ లోని కొండా ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు తమతో దురుసుగా ప్రవర్తించారని, గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని.. ఎస్ఐ, కానిస్టేబుల్.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కొండాపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఇప్పుడు కొండా అరెస్ట్ కు రంగం సిద్ధం చేసుకున్నారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *