ఈ బూట్ల రేటు రూ.3 కోట్లు

Spread the love

SHOES COST 3 CRORES

‘‘ఇరవై ఏళ్ల క్రితం నా చెప్పుల ధర రూ.500. ఇప్పుడు రూ.5 వేలు. ధర పెరిగింది కదా అని చెప్పులను నెత్తిపై పెట్టుకోం కదా’’ ఇదీ ఓ సినిమాలో ప్రకాశ్ రాజ్ డైలాగ్. కానీ ఈ బూట్ల విషయంలో మాత్రం ఈ డైలాగ్ వర్తించకపోవచ్చు. ఎందుకంటే వీటి ధర ఏకంగా రూ.3 కోట్లు మరి. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ నైకీ తయారుచేసిన ఈ బూట్లను వేలం వేయగా.. ఇంత పెద్ద మొత్తం లభించింది. 1972లో ‘మూన్‌ షూ’ పేరుతో తీసుకొచ్చిన ఈ అరుదైన బూట్లను సౌత్ బీ సంస్థ వేలం వేసింది. కెనడాకు చెందిన మైల్స్ నాథల్ అనే వ్యక్తి ఆన్ లైన్ వేలంలో పాల్గొని వీటి కోసం ఏకంగా 4,37,500 డాలర్లు వెచ్చించాడు. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.3 కోట్లు అన్నమాట. 1972 ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనే రన్నర్ల కోసం నైకీ సహ వ్యవస్థాపకుడు బిల్‌ బోవర్‌మన్‌ వీటిని రూపొందించారు. లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కావడంతో కేవలం 12 జతలు మాత్రమే తయారు చేశారు. వాటిలో ఒకదాన్ని సౌత్ బీ ఇప్పుడు వేలం వేసింది.

INTERNATIONAL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *