జూన్ ఫస్ట్ వీక్ నుంచి సినిమా షూటింగ్స్

shooting starts in june

దాదాపు రెండు నెలల విరామం తర్వాత మళ్లీ స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటూ సినిమా పరిశ్రమకు ప్రాణమైన సౌండ్ వినిపించబోతోంది. యస్ .. కరోనా వైరస్ వల్ల అనౌన్స్ అయిన లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్స్ మళ్లీ మొదలు కాబోతున్నాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ‘ఉచిత షూటింగ్స్’కు అక్కడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా, సీరియల్ షూటింగ్స్ కు సానుకూలంగా ఉందని తెలిపింది. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పలువురు ఇండస్ట్రీ పెద్దలు సమావేశమయ్యారు. రెండు నెలలుగా పనిలేక ఇబ్బందులు పడుతోన్న సినిమా కార్మికులకుఈ మీటింగ్ సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. సమావేశం తర్వాత.. లాక్ డౌన్ నిబంధనలకు లోబడి.. అలాగే కరోనా కోసం తీసుకునే జాగ్రత్తలతో కూడిన ఓ మెమరాండం నుంచి పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి సమర్పిస్తే షూటింగ్స్ కు అనుమతికి సంబంధించి ముఖ్యమంత్రిని ఒప్పిస్తానని శ్రీనివాస్ యాదవ్ చెప్పాడు.

అయితే నిజానికి ఇది షూటింగ్స్ కోసం అనుమతి తీసుకునేందు ఏర్పాటైన మీటింగే అని అందరికీ తెలుసు. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి ప్రభుత్వానికి పరిశ్రమ నుంచి పలు జాగ్రత్తలతో కూడిని హామీ పత్రం వెళుతుంది. అందుకు ప్రభుత్వం ఓకే చెబుతుంది. అయితే తెలంగాణలో ఈ నెల 29వరకూ.. దేశవ్యాప్తంగా 31వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది కాబట్టి.. ఈ పర్మిషన్స్ అన్నీ వచ్చే నెల మొదటి వారం వరకూ క్లియర్ అవుతాయి. అంటే అప్పటి నుంచి షూటింగ్స్ జరుపుకోవచ్చన్నమాట. ఇక ఈ వార్తతో టాలీవుడ్ లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నిజానికి ప్రభుత్వం సడలించిన అనేక నిబంధనలతో పోలిస్తే సినిమా షూటింగ్ కు పర్మిషన్ ఇవ్వడం పెద్ద విషయమేం కాదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది. కాబట్టి ఈ మేరకు విధి విధానాలు కూడా వాళ్లే రూపొందించి.. షూటింగ్ కు పర్మిషన్ అడిగిన వారి నుంచి హామీ పత్రం తీసుకుంటే ఇంకా బావుంటుందేమో.. మొత్తంగా ఈ మెగా మీటింగ్ లో చిరంజీవితో పాటు నాగార్జున, త్రివిక్రమ్, దిల్ రాజు, కొరటాల శివ, ఎన్. శంకర్, సురేష్ బాబుతో పాటు మరింతమంది సినిమా పెద్దలు హాజరయ్యారు. సో.. ఇక వచ్చే వారం నుంచి సినిమా., సీరియల్ షూటింగ్స్ ఎప్పట్లానే కొన్ని నిబంధనలతో మొదలవుతాయి. మరి ఇక ఆ థియేటర్స్ విషయంలో కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదేమో..

tollywood news

Related posts:

బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *