ఆమెకు అనుష్క రేంజ్ ఉందా..?

3
shreya movie update
shreya movie update

shreya movie update

ప్రయోగాలు చేసే హీరోయిన్లు చాలా తక్కువగానే ఉంటారు. కారణం.. ఎక్స్ పర్మెంట్స్ చేస్తే వారి గ్లామరస్ కెరీర్ కు ఇబ్బంది. పైగా హీరోయిన్లతో ఎక్స్ పర్మెంట్స్ చేయాలంటే వారికో రేంజ్ ఉండాలి. ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉండాలి. అలా ఉంది కాబట్టే అనుష్కతో నిశ్శబ్ధంతో ఓ పెద్ద ప్రయోగం చేశారు. అయితే ఇప్పుడు ఆమె రూట్ లోనే శ్రీయ కూడా ఎంటర్ అయింది. మరి శ్రియ చేస్తోన్న ఆ ప్రయోగం ఏంటో తెలుసా.. నిశ్శబ్ధం అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సినిమా. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. వచ్చే నెల ఓటిటిలో విడుదలవుతుంది అనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో అనుష్కతో ఓ ప్రయోగం చేశారు. నిశ్శబ్ధంలో స్వీటీ చెవిటి, మూగ యువతి పాత్రలో నటిస్తోంది. హీరోయిన్లతో ఇలాంటి ఎక్స్ పర్మెంట్ చేయడం దాదాపు అరుదు. కారణం కమర్షియల్ గా వర్కవుట్ కాదేమో అనే. అయితే అనుష్క రేంజ్ మారింది కాబట్టి.. తనతో ఈ ప్రయోగం చేశారు.

అది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో కానీ తన రూట్ లోనే శ్రియ కూడా వెళ్లబోతోందిట.. రీసెంట్ గా శ్రియ బర్త్ డే సందర్భంగా గమనం పేరుతో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా అనౌన్స్ అయింది. ఈ మూవీలో శ్రియ కూడా మూగ యువతి పాత్రలో నటిస్తుందట. అనుష్కతో పోలిస్తే శ్రియకు అంత ఇమేజ్ లేదు. పైగా ఇది ప్యాన్ ఇండియన్ మూవీ. అలాగే తన లుక్ చూస్తే చాలా ట్రెడిషనల్ గా ఉంది. అయితే మేకర్స్  శ్రియతో ధైర్యం చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం.. శ్రియ అయినా ఇంకెవరైనా.. మంచి కంటెంట్ ఉండి.. ప్రాపర్ గా ప్రమోషన్ చేస్తే ఆడియన్స్ కు సులువుగానే కనెక్ట్ అవుతారు. మరి అనుష్క, శ్రియల ఎక్స్ పర్మెంట్స్ ఏ మేరకు రీచ్ అవుతాయో చూద్దాం..

tollywood news