సిల్క్ స్మితతో మరో సినిమా

silk smitha movie

తెలుగు సినిమాల్లో శృంగార నాట్యాలకు ఓ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను విపరీతంగా తెచ్చినవారు జ్యోతిలక్ష్మి, జయమాలిని. వీరి తర్వాత ఆ స్థాయిలో వెండితెరను ఊపేసిన బ్యూటీ సిల్క్ స్మిత. ఆ టైమ్ లో సిల్క్ స్మిత పాట లేని సినిమా అంటే ప్రేక్షకులకు నచ్చలేదు. అంతటి క్రేజ్ తెచ్చుకున్న సిల్క్ స్మిత జీవితం విషాదంగా ముగిసింది. ఆమె కథతో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చినా.. లేటెస్ట్ గా సిల్క్ స్మిత బయోపిక్ అంటూ మరో మూవీ రాబోతోంది.. సిల్క్ స్మిత.. అసలు పేరు విజయలక్ష్మి అయినా.. ఈ పేరుతో పాపులర్ అయింది. స్పెషల్ సాంగ్స్ లో సిల్క్ స్మిత దక్షిణాదిలోని అన్ని భాషల్లో హవా చేసింది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. సిల్క్ పాట లేకుండా అంటే ఇబ్బందిగా ఫీలయ్యేవారు ఫ్యాన్స్. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వెళ్లి.. అనూహ్య పరిస్థితుల్లో ఐటమ్ సాంగ్స్ కు మారింది. అయితేనేం.. కేవలం తన ఒక్క పాటతోనే సినిమాకు ఓపెనింగ్స్ తెచ్చిన సత్తా సిల్క్ స్మితది. మరుగున పడిపోయిన ఎన్నో సినిమాలను ఆమెతో ఓ పాట చేయించి విడుదల చేసుకున్న సందర్భాలు అనేకం. సీతాకోక చిలుక వంటి సినిమాల్లో అద్భుతమైన నటనతోనూ ఆకట్టుకుంది. అయినా సిల్క్ స్మిత అంటే జనాలకు శృంగార తారగానే ఎక్కువ ఇష్టం. వైకుంఠపాలి వంటి సినిమా పరిశ్రమలో ఎన్నో నిచ్చెనలు ఎక్కిన సిల్క్ స్మిత.. ఒక్కసారి పామునోట్లో పడిన తర్వాత అధ:పాతాళానికి చేరింది. ఆ పాము ఆమె ప్రేమించినవాడు అంటారు కొందరు. ఆ తర్వాత తను బి గ్రేడ్ సినిమాలకూ తగ్గింది. అడల్ట్ మూవీస్ తో ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేసిది.

కానీ అప్పటికే చుట్టిముట్టిన సమస్యల మధ్య ఆఖరికి అనేక మందికి నిద్ర లేని రాత్రులను అందించిన ఆ అందం అలాంటి ఓ రాత్రి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. సిల్మ్ స్మితకు నటిగా, డ్యాన్సర్ గా ఉన్న క్రేజ్ పక్కన బెడితే.. ఈ రెండు దశలకూ తను చేరుకున్న విధానం ఖచ్చితంగా ఓ సినిమాకు సరిపోయేంత పెద్ద కథ అవుతుంది. అందుకే కొందరు ఆ ప్రయత్నం చేశారు. అయితే ఆమెలోని సెక్స్ అప్పీల్ ను వాడుకున్నారు తప్ప నిజమైన ఎమోషన్స్ ను ఎవరూ తేలేకపోయారు. ఆమె వేదనను ఎవరూ సరిగా చూపించే ప్రయత్నం చేయలేదు. అయితే తాము ఆ పనిచేస్తామంటూ తాజాగా తమిళ్ లో ఓ సినిమా రాబోతోంది. అవళ్ అప్పడిదాన్ అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రానికి కెఎస్ మణికందన్ దర్శకుడు. ఇంకా హీరోయిన్ ఫైనల్ కానీ ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభించబోతున్నారు. మరి ఈ సారి ఎలాంటి కంటెంట్ తో సిల్క్ జీవితాన్ని క్యాష్ చేసుకుంటారో చూడాలి.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *