వివేకా హత్య కేసులో వారిద్దరిపై విచారణ

Spread the love

SIT interrogates YS Bhaskar reddy

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు  కొనసాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలైనా ఇంకా  వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. వైయస్ భాస్కరరెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డిలతో పాటు కొందరు టీడీపీ నేతలను రహస్యంగా విచారిస్తున్నారు  సిట్ అధికారులు గత ఎన్నికలకు ముందు మార్చి 14వ తేదీన వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు . అప్పటినుండి ఇప్పటివరకు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించలేదు.  ఈ హత్యపై అప్పటి  టీడీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.  అయితే  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి విచారణ వేగవంతం చేయించాలనే ఉద్దేశంతో టిడిపి హయాంలో  ఏర్పాటు అయిన సిట్ ను తొలగించి ఆ స్థానంలో కొత్త సిట్ ను ఏర్పాటు చేసింది . ఈ కేసులో  ఇప్పటికే అనుమానితులుగా ఉన్న పలువురికి నార్కో అనాలిసిస్ టెస్టులు కూడా చేశారు. వీరిలో శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య  చేసుకున్నారు. ఇక ఈ నేపధ్యంలో సిట్ విచారణ కాస్త జాప్యం అయ్యింది. ఇక తాజాగా మరోమారు దర్యాప్తులో వేగం పెంచారు సిట్ అధికారులు .

SIT interrogates YS Bhaskar reddy,ys vivekananda reddy murder case , ys bhaskar reddy, manohar reddy , sit, inquiry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *