పటాన్ చెరులో ఎస్ఎంటీ స్టెంట్ తయారీ యూనిట్ కు భూమిపూజ

SMT STENT UNIT STARTED IN PATANCHERU

దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టడానికి అనువైన రాష్ట్రం తెలంగాణ, అనువైన నగరం హైదరాబాద్ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. అనువైన భూమి, నిరంతర కరెంటు, సులభతర అనుమతులు , నీటి కేటాయింపులు, మౌలిక సదుపాయాలు, నైపుణ్య, ఇతర ఉద్యోగులు , అతి చౌకగా దొరికే పని వాళ్ళ లభ్యత , పక్కాగా శాంతి భద్రతలు వంటి అంశాలు పారిశ్రామికవేత్తలను తెలంగాణ వైపు ఆకర్షింపజేయడానికి ప్రధాన కారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు , గత ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ కార్యాచరణ సత్ఫలితాలు ఇస్తున్న కారణంగానే పారిశ్రామికాభివృద్ధి లో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం సుల్తాన్పూర్ టీఎస్ఐఐసీ మెడికల్ డివైస్ పార్కులో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ సంస్థ నెలకొల్పే స్టెంట్ తయారీ యూనిట్ కు భూమి పూజ కార్యక్రమంలో వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి , ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి , పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజాన్, టీఎస్ఐఐసీ ఎండి నర్సింహా రెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంత రావు, జడ్పి వైస్ చైర్మన్ ప్రభాకర్, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ చైర్మన్ ధీరజ్ లాల్ కొటారియా, ఎండి భార్గవ కొటారియా, వైస్ ప్రసిడెంట్ రాజీవ్ చిబ్బర్, సంస్థ ప్రతినిధులు బల్విందర్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గుండె ఆపరేషన్ కు వినియోగించే స్టెంట్ తయారు చేసే కంపెనీ తెలంగాణాలో ఏర్పాటు కానుండటం మనందరికీ గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ , గత పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి వల్లే ఆసియా ఖండంలో అతి పెద్ద స్టెంట్ తయారీ కంపెనీ రాష్ట్రానికి వచ్చినందన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టడానికి అనువైన రాష్ట్రము తెలంగాణ , అనువైన నగరంగా హైదరాబాద్ ఖ్యాతిని గడించిందన్నారు. నిన్న ఫార్మా ఇండస్ట్రీస్, ఐ టి ఇండస్ట్రిస్ లో కావచ్చు ఇవాళ మెడికల్ డివైసెస్, ఇతర ఇండస్ట్రీస్ ను నెలకొల్పే విషయంలో ఇవాళ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వైపు చూస్తున్నారని చెప్పారు.  దీనికి కారణం తెలంగాణాలో పక్కాగా శాంతి భద్రత లు ఉండటమేనని , తనకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రములో ఉన్నంత లా అండ్ ఆర్డర్ దేశంలో మరెక్కడా లేదన్నారు. ఒకప్పుడు అభివృద్ధి అంటే గుజరాత్ అని వినేవాళ్ళం కానీ ఇవాలా అభివృద్ధి అంటే తెలంగాణ, హైదరాబాద్ మాత్రమేనని రాజేందర్ అన్నారు . 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని , ఇక్కడ ఒక్క పరిశ్రమలకు మాత్రమే కాదు వ్యవసాయ , డొమెస్టిక్ రంగాలకు కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరా జరుగుతుందని చెప్పారు.

ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో వారానికి నాలుగు రోజులు పరిశ్రమలకు కరెంటు సరఫరా చేయాలనీ పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో ఆందోళనకు దిగిన దారుణ పరిస్థితులు ఉండేవన్నారు . కరెంటు సరఫరా లేక పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నారని చివరకు యూనిటు కు ౧౧ రూపాయలకు అయినా సరే మాకు కావసిన కరెంటును ఇవ్వాలని వాళ్ళు పరిశ్రమలకు కాలేంటూ ఇవ్వక నాటి పాలకులు చేతులు ఎత్తేశారని గుర్తు చేసారు . మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటల పాటు కరెంటును అందిస్తున్నందు వల్లే పరిశ్రమలు అభివృద్ధి బాట పట్టాయన్నారు . అనువైన భూమి , నిరంతర కరెంటు, సులభతర అనుమతులు , అవసరాల మేరకు నీటి కేటాయింపులు, పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు, అందుబాటులో నైపుణ్య, ఇతర ఉద్యోగులు , అతి చౌకగా దొరికే పని వాళ్ళు, పక్కాగా శాంతి భద్రతలు పారిశ్రామికవేత్తలను తెలంగాణ వైపు ఆకర్షింపజేయడానికి ప్రధాన కారణమన్నారు పారిశ్రామికంగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రగతిశీల విధాన ఫలితంగానే గుజరాత్ , మహారాష్ట్ర నుండి కూడా పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రముకు వస్తుండటం మనకు గొప్ప విజయం అన్నారు. తెలంగాణకు పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలి రావడానికి ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానమే మరో కారణం మన్నారు. గతంలో పరిశ్రమలకు అనుమతుల కోసం రెండు మూడేళ్లు అధికారుల చుట్టూ తిరగాల్సి దుస్థితి ఎదురయ్యేదని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సింగిల్ విండో పద్దతిలో ఎవరి దగ్గరికి తిరగకుండా, ఎవ్వరికి డబ్బులు ఇవ్వకుండా, పారదర్శకంగా కేవలం ౧౫ రోజుల్లోపే పరిశ్రమలకు అన్నిరకాల అనుమతులు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే నని మంత్రి ఈటెల తెలిపారు .

TELANGANA INDUSTRIAL LATEST NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *