సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పూర్ణిమ అనుమానాస్పద మృతి

 Software Engineer Purnima Mysterious Death

హైదరాబాద్ లోని సనత్ నగర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పూర్ణిమ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇరవై రోజుల క్రితం కొత్తగా తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న పూర్ణిమ ప్రేమపెళ్లి చేసుకున్న 20 రోజులకే పూర్ణిమ చనిపోవటంతో పలు అనుమానాలు వ్యక్తం అవతున్నాయి.

పూర్ణిమ శరీరంపై తలపై మెడపై గాయాలున్నాయని పెళ్లి చేసుకున్న కార్తీక్ ఆమెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వారు పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయమని తమ బిడ్డను చంపిన కార్తీక్ కు కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఇక పూర్ణిమ భర్త కార్తీక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న పూర్ణిమ ప్రేమించిన 20 రోజుల క్రితం దాసరి కార్తీక్‌ను పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంది. ఈ క్రమంలో పెళ్లై నెల రోజులు పూర్తి కాకుండానే పూర్ణిమ మృతి చెందటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లోని తల్లిదండ్రులు తమ వివాహానికి అంగీకరించలేదని పెళ్లికి ముందు పూర్ణిమ, కార్తీక్ పోలీసుల సహాయం కోరినట్లుగా చెబుతున్నారు.

tags : Sanath nagar, Software Engineer, Poornima, Love Marriage, Karthik, Suspecious Death

విలన్ గా ప్రభాస్?

పవన్ కు మద్దతు పలికిన అచ్చెన్నాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *