రిపోర్టర్ల ఆకలిని పట్టించుకోవాలి

SOLVE REPORTERS ISSUES PLEASE

భార్యా పిల్లలు, తల్లి దండ్రుల ఆకలి తీర్చలేక మనోవేదనకు గురవుతున్న లోకల్ రిపోర్టర్లను ఆయా మీడియా సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) విజ్ఞప్తి చేస్తుంది. ఎలాంటి జీత భత్యాలు లేకుండా రోజంతా శ్రమించే లోకల్ రిపోర్టర్లకు ప్రింట్ మీడియాలో లైన్ అకౌంట్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో స్క్రోలింగులు, బైట్లు, స్పెషల్ స్టోరీలు, ప్రోగ్రామ్స్ కవరేజ్ లెక్కల ఆధారంగా డబ్బులు చెల్లించే విధానం కొనసాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రోజువారీ కూలీ పద్దతిలో చెల్లించే విధానం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మూలంగా లోకల్ రిపోర్టర్లకు వార్తల సేకరణ తగ్గిపోవడంతో పని లేకుండా పోయింది. దీంతో గృహ నిర్బంధంలో వాళ్ళు పడుతున్న ఆర్థిక కష్టాలు అన్నిన్నీ కావు. కరోనా విపత్కర పరిస్థితుల నుండి వివిధ వర్గాలను ఆదుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వం, ఆకలితో అలమటిస్తున్న మీడియా రంగంలో శ్రమ జీవులైన లోకల్ రిపోర్టర్లపై దృష్టి సారించాలని టీయూడబ్ల్యూజే కోరుతున్నది.

కరోనా సహాయ నిధికి ఆయా వర్గాలు సహాయం చేస్తున్న విధంగానే మీడియా సంస్థల యాజమాన్యాల సహాయం లోకల్ రిపోర్టర్లకు అందే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని భావిస్తున్నది. ప్రభుత్వం తలచుకుంటే ఇది పెద్ద పనేం కాదని.. రాష్ట్రంలో సుమారు 17,000 మంది లోకల్ రిపోర్టర్లు పనిచేస్తున్నారని వెల్లడించింది. యాజమాన్యాల వద్ద ఉన్న జాబితా ప్రకారం లోకల్ రిపోర్టర్లకు కనీస ఆర్థిక సహకారం అందించగలిగితే ఈ ఆపదకాలం నుండి వారిని గట్టెక్కించిన వారవుతారని వేడుకుంటున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వర్గాల సంక్షేమానికి చేపట్టబోయే సహాయక చర్యల్లో అత్యవసర సేవల విభాగానికి చెందిన మీడియా ప్రతినిధులకు కూడా వర్తింపజేయాలని కోరుతున్నది.

 

telangana journalists issues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *