టీఆర్ఎస్ కు సోమారపు రాజీనామా

Spread the love

SOMARAPU DECISION SHOCK TO TRS

మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.కానీ ఆయన ఆ వార్తను ఖండించారు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో గోదావరిఖని నుండి సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.ఈ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి చందర్ విజయం సాధించాడు. ఆ తర్వాత చందర్ టీఆర్ఎస్‌లో చేరారు.
ఇక తనకు పార్టీలో తనకు తగిన గౌరవం లేదని సోమారపు సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. మంగళవారం నాడు గోదావరిఖనిలో మీడియాతో సోమారపు సత్యనారాయణ మాట్టాడారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. పార్టీలో కలిసి పనిచేయడం సాధ్యం కావడం లేదన్నారు. మాజీ ఎంపీ బాల్కసుమన్‌తో పాటు మరికొందరు పార్టీ నేతలు తనను ఓడించారని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆరోపించారు.మంగళవారం నాడు ఆయన గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడారు. పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకుండా తనను ఇబ్బంది పెట్టారని ఆయన చెప్పారు. పార్టీలో తనకు గౌరవం లేకుండా పోయిందన్నారు. పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయిందని సోమారపు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఈ కారణంగానే తాను పార్టీని వీడాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పారు. తాను ఏ పార్టీలో చేరనని, భవిష్యత్తులో రామగుండం మేయర్ గా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. సోమారపు సత్యనారాయణ ఇటీవలనే బీజేపీ నేతలను కలిసినట్టుగా ప్రచారం సాగుతోంది. ఆయన బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందంటున్నారు. కానీ, ఇవాళ ఆయన మాత్రం తాను ఏ పార్టీలో చేరడం లేదని ప్రకటించడం గమనార్హం.

SOMARAPU SATHYANARAYANA 

TAGS : TELANGANA, TRS, Somarapu Sathyanarayana , resignation, disappointment , TRS party , Balka Suman , allegations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *