చిరంజీవి బర్త్ డే రోజు స్పెషల్ సర్ ప్రైజ్

2
song on chiru birthday
song on chiru birthday

song on chiru birthday

మెగాస్టార్ చిరంజీవి.. రీ ఎంట్రీ తర్వాత సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నాడు. ఖైదీ నెంబర్ 150తో తన రేంజ్ లోనే ఎంటర్టైన్ చేసినా.. తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరాతో సత్తా చాటాడు. ఇక ఇప్పుడు వయసుకు తగ్గ పాత్రలో కొరటాల శివ డైరెక్షన్ లో ‘ఆచార్య’గా రాబోతున్నాడు. కరోనా మహమ్మారి వల్ల అన్ని పరిశ్రమల్లానే సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు పడుతోంది. తన వంతుగా పరిశ్రమలోని కార్మికుల కోసం ఇతర హీరోలను కలుపుకుని.. ‘సిసిసి’ కరోనా క్రైసిస్ ఛారిటీని స్టార్ట్ చేసి ఎంతోమందిని ఆదుకున్నారు. నిజానికి ఈ పాండమిక్ టైమ్ లేకపోతే.. ఈ నెల 15న ఆచార్యను విడుదల చేయాలనుకున్నారు కూడా. కానీ రామ్ చరణ్ కూడా ఉండటంతో దసరాకు విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఆచార్య ఇప్పటికి 30శాతం మాత్రమే షూటింగ్ పూర్తయింది. ఇంకా చాలా బ్యాలన్స్ ఉంది. అందులో ప్రధానంగా రామ్ చరణ్ కు సంబంధించిన పార్ట్ కు చాలా టైమ్ పట్టేలా ఉంది. పైగా అతని సరసన నటించే హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. అయినా ఆచార్యపై హైప్ తగ్గకూడదనుకున్నారేమో.. చిరంజీవి బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారట. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఆచార్య నుంచి ఈ నెల 22న ఓ టీజర్ విడుదల చేయబోతున్నారట.

ఆ రోజు మెగాస్టార్ బర్త్ డే కదా. అందుకే ఈ స్పెషల్ సర్ ప్రైజ్ అంటున్నారు. ఇప్పటి వరకూ అయింది 30శాతం షూటింగే అయినా అందులో కొన్ని క్రూసియల్ సీన్స్ ఉన్నాయి. అలాగే ఓ రెజీనా కసాండ్రా ప్రత్యేక పాత్రలో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఫినిష్ అయింది. అందుకే ఇందులో నుంచి వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించే కొన్ని సీన్స్ ను కట్ చేసి టీజర్ విడుదల చేయబోతున్నారు అనేది లేటెస్ట్ గా మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తోన్న మాట. ఇదే నిజమైతే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స కు ఇది స్వీట్ న్యూస్ అనే చెప్పాలి. మామూలుగా ఇప్పుడసలే ఏ పెద్ద స్టార్ నుంచీ ఏ సందడీ లేదు. అలాంటి మెగాస్టార్ అయినా ముందుకు వస్తే ఇంక మిగిలిన వాళ్లు కూడా హుషార్ అవుతారు. సో.. ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే కానుకగా దర్శకుడు కొరటాల శివ ఓ టీజర్ విడుదల చేయబోతున్నాడన్నమాట.

tollywood news